10న ఖోఖో, నెట్‌బాల్, టెన్నిస్ వాలీబాల్ సెలక్షన్స్


Fri,November 8, 2019 12:08 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : ఈ నెల 10వ తేదీన ఉమ్మడి మెదక్ జిల్లా ఖో ఖో, నెట్‌బాల్, టెన్నిస్ వాలీబాల్ సెలక్షన్స్ నిర్వహించనున్నారు. పాఠశాల క్రీడా సమాఖ్య అధ్వర్యంలో చేపడుతున్న ఈ ఎంపికల్లో అండర్ 14,17 బాలబాలికలు పాల్గొంటారని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి గ్యాదరి భిక్షపతి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా తొగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ ఎంపికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉదయం 9.30 కల్లా విద్యార్థులు తమ పాఠశాల నుంచి ఇచ్చిన బోనోఫైడ్, ఆధార్ కార్డుతో రిపోర్ట్ చేయాలని సూచించారు. మరిన్ని వివరాలకు వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్. గోవర్దన్‌రెడ్డి ( సెల్ : 9866504089 ) నెంబర్‌ని సంప్రదించాలని భిక్షపతి తెలిపారు

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...