హిందీలో పది గ్రేడింగ్ సులభమే


Fri,November 8, 2019 12:08 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : ఈ సారి పదో తరగతి ఫలితాల్లో జిల్లా ముందంజలో ఉండాలని, అందుకోసం ప్రణాళిక బద్దంగా ముందుకెళ్లాలని జిల్లా విద్యాశాఖాధికారి డా. రవికాంతారావు సూచించారు. గురువారం సిద్దిపేట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో తెలంగాణ హిందీ ఫోరమ్, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో హిందీ భాషలో పది గ్రేడింగ్ సాధించడంపై అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ ఎస్‌ఈఆర్‌టీ హిందీ భాషా నిపుణులు కిరణ్‌జీ, రీతుజీ చేత మండలాల నుంచి ఇద్దరు రిసోర్స్ పర్సన్స్, హిందీ భాషా ఉపాధ్యాయులకు పది గ్రేడింగ్ సాధించే విధానంపై మార్గదర్శనం చేశారు. సాధారణ విద్యార్థులు కనీస సామర్థ్యాలు సాధించే నూతన పద్ధతులు, హిందీ భాషా వికాసంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర అనే అంశాలపై శిక్షణ అందించారు.

కార్యక్రమానికి జిల్లా విద్యాధికారి డా. రవికాంతారావు హాజరై శిక్షణ సదస్సునుద్దేశించి మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో జాతీయ భాషా హిందీకి చాలా ప్రాధాన్యత ఉందన్నారు. హిందీ బోధనను మరింత మెరుగు పరిచేందుకు సరళమైన పద్ధతులు ఉపయోగించాలని తెలంగాణ హిందీ ఫోరమ్ చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు. ఏఎస్‌వో రమేశ్ మాట్లాడుతూ ఇలాంటి ప్రత్యేక శిక్షణ శిబిరాలు మరిన్ని జరుగాలని, హిందీపై శ్రద్ధ కనబరిస్తే మంచి మార్కులు సులభంగా సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో ఫోరం సభ్యులు బి. సుధాకర్, యండీ. రవూఫ్, చందన, గురువయ్య, విశ్వరూపం ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...