భవిష్యత్ తరాల కోసం నీటిని సంరక్షించాలి


Fri,November 8, 2019 12:07 AM

సిద్దిపేట ఎడ్యుకేషన్ : భవిష్యత్ తరాలకు నీటి వనరులను, కాలుష్య రహిత ప్రకృతిని అందించాలని జిల్లా విద్యాధికారి డా. రవికాంతారావు ఆకాంక్షించారు. సిద్దిపేట ప్రభుత్వ నూతన ఉన్నత పాఠశాలలో నీటి నాణ్యత మదింపు పరీక్ష, నీటి సంరక్షణ పద్ధతులపై శిక్షణ శిబిరం నిర్వహించారు. జిల్లాలోని 70 పాఠశాలల భౌతికశాస్త్ర ఉపాధ్యాయులకు ఈ అంశాలపై అవగాహన కల్పించారు. నురగ ఏర్పడే విధానం, ఆమ్లత్వం, క్షారత్వం వంటి అంశాలపై కె. మహేందర్ ఉపాధ్యాయులకు వివరించారు. ఈ కార్యక్రమానికి డీఈవో రవికాంతారావు హజరై మాట్లాడుతూ.. నీటి వనరులతో పాటు సహజ వనరులను కాపాడుకునే విధంగా విద్యార్థులకు తెలియజెప్పాలని సూచించారు. జిల్లా సెక్టోరియల్ ఆఫీసర్ తాళ్లపల్లి రమేశ్ మాట్లాడుతూ.. నీటి వనరులు ఉన్నచోటనే నాగరికత వెలిసిందన్నారు. వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. రిసోర్స్ పర్సన్ రవీందర్ రెడ్డి పలు అంశాలపై ప్రయోగాలను కృత్యాల ద్వారా వివరించారు.

36
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...