పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి


Wed,November 6, 2019 11:08 PM

సిద్దిపేట టౌన్ : పోలీసులు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ అన్నారు. కమిషనరేట్ కార్యాలయ ఆవరణ లో యశోద దవాఖాన సౌజన్యంతో పోలీసులకు బు ధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ జోయల్ డెవిస్ మాట్లాడుతూ పో లీసుల దినచర్య, జీవన విధానం మిగతా వారితో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ఆ రోగ్య రక్షణకు యోగా, వ్యాయామం వంటివి దినచర్యలో భాగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో వ్యాధులు వేగంగా విస్తరిస్తున్నాయని వాటి బారిన పడకుండా ఆరోగ్య సూచనలు పాటిస్తే మేలు జరుగుతుందన్నారు. ఆహార పదార్థాల కల్తీ జరుగుతుందని వాటిని గుర్తించి మెరుగైన ఆహారం తీసుకోవాలన్నారు.

40 సంవత్సరాలు పైబడిన వారందరు 3 నెలలకో సారి వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. కమిషనరేట్‌లో ప్రతి నెల బుధవారం పోలీసుల ఆరోగ్యం దృష్ట్యా యశోద దవాఖాన సౌజన్యంతో మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. పోలీసులు, వారి కుటుంబాలు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంతకు ముందు సీపీ జోయల్ డెవిస్ ,పోలీసులు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. కార్యక్రమంలో యశోద దవాఖాన వైద్యులు, అడిషనల్ డీసీపీ నర్సింహారెడ్డి, ఎస్‌ఐలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, హోంగార్డులు పాల్గొన్నారు.

24
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...