నేడు తునికి బొల్లారంలో గృహ ప్రవేశాలు


Wed,November 6, 2019 11:08 PM

ములుగు : ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా భూములు, ఇండ్లు కోల్పోయి నిర్వాసితులుగా మారిన ముంపు గ్రామాల ప్రజలను ప్రభుత్వం అక్కున చేర్చుకొని అండగా నిలుస్తూ వారి కోసం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఆర్‌అండ్‌ఆర్ కాలనీ గృహాలను నేడు కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి చేతుల మీదుగా నిర్వాసితులకు అందివ్వనున్నారు. కొండపోచమ్మ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా మామిడ్యాల, భైలంపూర్, తానేదార్‌పల్లి, తానేదార్‌పల్లి తండా గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవగా..మండల కేంద్రం మర్కూక్‌లోని కొంతమంది రైతులు తమ వ్యవసాయ భూములు కోల్పోయారు.

ముంపునకు గురైన నిర్వాసితులకు పునరావాసం కల్పిస్తూ ములుగు మండల పరిధిలోని తునికిబొల్లారం సమీపంలో ప్రభుత్వం చేపట్టిని ఆర్‌అండ్‌ఆర్ కాలనీ నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి. సుమారు 260 ఎకరాల్లో 1200 ఇండ్ల నిర్మాణాలు ప్రభుత్వం చేపట్టగా 600 ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మొదటి విడుతగా గురువారం కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి చేతుల మీదుగా తానేదార్‌పల్లి తండాకు చెందిన 82 మంది లబ్ధిదారులకు గృహాలను అందజేసి సామూహిక గృహ ప్రవేశాలు జరుపనున్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...