వ్యాధి గ్రస్తులకు ప్రేమతో వైద్యం అందించాలి


Wed,November 6, 2019 11:08 PM

మిరుదొడ్డి : ఆర్థికంగా ఇబ్బందులను అనుభవిస్తూ సర్కార్ దవాఖానకు విచ్చేసే పేద ప్రజలకు వైద్య సిబ్బంది సరైన వైద్యాన్ని అందించాలని జిల్లా వైద్యాధికారి (డీఎంహెచ్‌వో) విజయరాణి అన్నారు. బుధవారం మిరుదొడ్డి, భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌వో దవాఖానాల్లోని రికార్డులను పరిశీలించి వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. సిబ్బంది పని తీరు పై సంతృప్తిని వ్యకం చేశారు. అనంతరం డీఎంహెచ్‌వో మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగానికి అధిక ప్రాధాన్యతను కల్పిస్తూ నాణ్యమై వైద్యాన్ని అందిస్తున్నారు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు వివిధ రకాల వ్యాధులకు సర్కార్ దవాఖానాలోల్లోనే వైద్యం చేయించుకొని ఆర్థిక పరమైన ఇబ్బందులను అధిగమించాలని కోరారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా గతంలో ఎప్పుడూ లేని విధంగా నేడు సర్కార్ దవాఖానల్లోనే గర్భిణులు ప్రసవాలు చేయించుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా వైద్యులు రోగులకు సరైన వైద్యం అందించి ప్రజల నుంచి మన్ననలు పొందాలన్నారు. డీఎంహెచ్‌వో వెంట మిరుదొడ్డి, భూంపల్లి దవాఖానల వైద్య సిబ్బంది సూపర్ వైజర్ లింగమూర్తి, ఫార్మాసిస్టు మసూద్‌ఖాన్, స్టాఫ్ నర్సులు, ఏఎన్‌ఎంలు ఉన్నారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...