కదులుతున్న కార్మికులు


Mon,November 4, 2019 11:04 PM

-సిద్దిపేట డిపోలో విధుల్లో చేరిన నలుగురు కార్మికులు
-నేటి అర్ధరాత్రి వరకు గడువు ఉండడంతో.. జిల్లాలో పెద్ద సంఖ్యలో విధుల్లో చేరనున్న కార్మికులు
-పూర్తి భద్రతను కల్పిస్తున్న పోలీసు యంత్రాంగం

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : ఆర్టీసీ కార్మికులంతా మా బిడ్డలు.. మీరంతా బేషరతుగా విధుల్లో చేరాలి.. మిమ్మల్ని కా పాడుకుంటామని సీఎం కేసీఆర్ పిలుపునివ్వడంతో జిల్లాలోని ఆర్టీసీ కార్మికులు విధుల్లో చేరడానికి ముందుకు వస్తున్నారు. నేటి అర్ధరాత్రి వరకు (మంగళవారం) విధుల్లో చేరడానికి గడువు ఉండడంతో ఇప్పటికే నలుగురు ఆర్టీసీ కార్మికులు వి ధుల్లో చేరగా మంగళవారం మరింత మంది కార్మికులు డ్యూ టీలో జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నారు. డ్యూటీలో చేరిన కార్మికులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం భద్రత కల్పిస్తున్నది. జిల్లా కేంద్రమైన సిద్దిపేటతో పాటు గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌లలో ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో పనిచేస్తున్న కార్మికులు సమ్మెలో ఉన్న విషయం తెలిసిందే. సమ్మెలో ఉన్న కార్మికులంతా బేషరతుగా విధుల్లో చేరాలని సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపుతో ఆర్టీసీ కార్మికులు కదులుతున్నారు.

ఆదివారం సిద్దిపేట డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ కండక్టర్ బాలవిశ్వేశ్వరచారి విధుల్లో చేరగా సోమవారం డ్రైవర్ పి.మల్లేశం, కండక్టర్లు కె.నర్సింహులు, ఎం.సంతోష్ డ్యూటీలో చేరినట్లు సిద్దిపేట డిపో మేనేజర్ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. డ్యూటీలో జాయిన్ అయిన వారు సమ్మతిపత్రాలు అందించినట్లు వివరించారు. కాగా నేటి అర్ధరాత్రికి గడువు ఉండడంతో 4 డిపోల పరిధిలో మరింత మంది కార్మికులు విధుల్లో చేరనున్నారు. ఆయా డిపోల పరిధిలో పనిచేస్తున్న డ్రైవర్లు, కండక్టర్లు డ్యూటీలో చేరడానికి సన్నద్ధమవుతున్నట్లు కొంత మంది కార్మికులు తెలిపారు. వివిధ యూనియన్‌లో పనిచేస్తున్న కార్మికులు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు. డ్యూటీనే నమ్ముకొని జీవనం సాగిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు యూనియన్లతో పనిలేకుండా ముందుకు రావడానికి సమాయత్తమవుతున్నారు. విధుల్లో చేరుతున్న కార్మికులను ఎవరైనా బెదిరిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది.

70
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...