విజయవంతంగా ముగిసిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలు


Mon,November 4, 2019 11:01 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ : భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి పాఠశాలల అండర్-17 వాలీబాల్ పోటీలు సోమవారం సాయంత్రం విజయవంతంగా ముగిశాయి. ఈ వాలీబాల్ పోటీలు ఈనెల 2వ తేదీన ప్రారంభమైన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్రం నుంచి ఉభయ పది జిల్లాలకు చెందిన సుమారు 120మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. లీగ్‌కమ్ నాకౌట్ పద్దతిలో నిర్వహించిన ఈ పోటీల్లో వరంగల్, నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జట్లు నాకౌట్ దశకు చేరుకున్నాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ వరంగల్, నల్గొండ జట్ల మధ్య జరిగింది. వరంగల్ జట్టు 25-19, 25-16 స్కోర్ తేడాతో గెలుపొంది ఫైనల్‌క్ ప్రవేశించింది. రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ ఖమ్మం, రంగారెడ్డి జట్ల మధ్య జరిగింది. ఖమ్మం జట్టు 25-18, 25-22 తేడాతో విజయం సాధించింది.

భద్రాచలం పుణ్యక్షేత్రంలో మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్17 వాలీబాల్ పోటీలు సోమవారం విజయవంతంగా ముగిశాయి. ఆర్గనైజింగ్ సెక్రటరీ బోళ్ల వెంకటేశ్వర్లు ఈ క్రీడలను దగ్గరుండి పర్యవేక్షించారు. రాష్ట్ర నలుమూలల నుంచి క్రీడాకారులు అత్యధికంగా పాల్గొన్నప్పటికి ఎవ్వరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు క్రీడా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఈడీలు, పీఈటీలు క్రీడల విజయవంతానికి తమ వంతు సహకారం అందజేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ పోటీలు స్థానికులను ఉత్సాహ పరిచాయి.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...