మక్కలే మక్కలు


Sun,November 3, 2019 11:19 PM

-హుస్నాబాద్ మార్కెట్‌కు పోటెత్తుతున్న మొక్కజొన్న
-శనివారం ఒక్కరోజే 600 క్వింటాళ్లు కొనుగోలు
-రెండురోజుల్లో 633 క్వింటాళ్ల ధాన్యం తూకం
-రైతులు, కూలీలతో మార్కెట్ కిటకిట

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో కొనుగోళ్లు జోరందుకున్నాయి. గత నెల 20వ తేదీన మార్కెట్‌లో సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ ప్రారంభించారు. ఆ తరువాత నిత్యం వర్షాలు పడడంతో మార్కెట్‌కు ధాన్యం రాలేదు. ఇటీవల రెండు, మూడు రోజుల నుంచి వర్షాలు ఆగిపోయి ఎండ రావడంతో ధాన్యాన్ని ఆరబెట్టుకున్న రైతులు మార్కెట్‌కు తేవడం మొదలుపెట్టారు. రెండు రోజుల్లోనే 24 మంది రైతులకు చెందిన 633 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. అలాగే ఇటీవల ట్రేడర్లతో సమావేశం నిర్వహించి బహిరంగ కొనుగోళ్లు చేయరాదని ఆదేశాలు జారీ చేయడంతో రైతులు పండించిన మక్కలను మార్కెట్‌కు తేవడం మొదలుపెట్టారు. శనివారం ఒక్కరోజులోనే 600 క్వింటాళ్ల మక్కలను మార్కెట్‌లో కొనుగోలు చేశారు. ట్రేడర్లు మక్కలను పోటీపడి వేలం పాటలో పాల్గొని కొనుగోలు చేశారు.

దీంతో రైతులకు క్వింటాళు మక్కలకు సుమారు 1,800ల నుంచి 1,850 వరకు ధర పలికింది. ఒకవైపు ధాన్యం, మరోవైపు మక్కల కొనుగోళ్లు జరుగుతుండడంతో మార్కెట్ యార్డు మొత్తం సందడిగా మారింది. రైతులు, వారు తెచ్చిన వాహనాలు, హమాలీలు, మహిళా కూలీలతో మార్కెట్ కిటకిటాలాడుతున్నది. సోమవారం నుంచి కొనుగోళ్లు ఇంకా రెట్టింపవుతాయని అధికారులుచెప్తున్నారు. రైతులు తమ మక్కలు గానీ, ధాన్యాన్ని గానీ పూర్తిగా ఆరబెట్టుకొని వస్తే ప్రభుత్వం ఇస్తున్న పూర్తి మద్దతు ధరను పొందవచ్చని అంటున్నారు. ఆరు బయట కొనుగోళ్లను నిషేధించి అన్ని పంటలను మార్కెట్‌లోనే కొనుగోలు చేయాలనే నిబంధన తేవడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

67
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...