ఓపెన్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్


Sun,November 3, 2019 11:17 PM

సిద్దిపేట టౌన్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పదోతరగతి, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామని సిద్దిపేట పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్ ఆదివారం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 4 నుంచి 16 వరకు జిల్లాలో టెన్త్, ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు జరుగుతాయన్నారు. జిల్లాలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వ మల్టీపర్పస్ హైస్కూల్ కేంద్రంగా, పదవ తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ప్రభుత్వ గర్ల్స్ హైస్కూల్ కేంద్రంగా పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ నిబంధన అమలవుతుందన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న జిరాక్స్, డీటీపీ సెంటర్లు మూసి ఉంచాలన్నారు. విద్యార్థులు ఆందోళన చెందకుండా పరీక్షా కేంద్రానికి గంట ముందుగానే చేరుకోవాలని, ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సీపీ జోయల్ డెవిస్ సూచించారు.

33
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...