రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి


Sun,November 3, 2019 11:17 PM

-మహ్మదాపూర్‌లో విషాదం
హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: పట్టణంలోని నాగారం రోడ్డు మారుపాక రాజయ్య విగ్రహం క్రాసింగ్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని మహ్మదాపూర్ గ్రామానికి చెందిన పిట్టల శ్రీనివాస్(45) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మృతుడు శ్రీనివాస్ టీఎస్ 36 బి 1159నంబరు గల బైక్‌పై హుస్నాబాద్ నుంచి మహ్మదాపూర్‌కు వెళ్తుండగా ఇదే రూట్లో కరీంనగర్ వైపు వెళ్తున్న ఏపీ 01 డబ్ల్యూ 6066నంబరు గల లారీని ఓవర్‌టేక్ చేయబోయాడు. ఎదురుగా మరో బైక్ రావడంతో అకస్మాత్తుగా బ్రేక్ కొట్టి పక్కనే వెళ్తున్న లారీ కింద పడిపోయాడు. లారీ వెనుకటైర్లు శ్రీనివాస్ తలపై నుంచి వెళ్లడంతో తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్‌ఐ పాపయ్యనాయక్ తన సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని స్థానిక సర్కారు దవాఖానకు తరలించారు. విషయం తెలుసుకున్న మహ్మదాపూర్‌లోని శ్రీనివాస్ కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మృతుడికి భార్య శ్రీలత, కుమారులు అజయ్, పవన్ ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అందరితో కలివిడిగా ఉండే శ్రీనివాస్ మృత్యువాత పడటంతో మహ్మదాపూర్ గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...