వేముగంటి సాహిత్యం అజరామరం


Sun,November 3, 2019 11:17 PM

సిద్దిపేట టౌన్ : సాహిత్య చరిత్రలో వేముగంటి నర్సింహాచార్యుల సాహిత్యం చిరస్థాయిగా నిలిచి ఉంటుందని, ఆయన సాహిత్యం అజరామరమని తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ నందిని సిధారెడ్డి అన్నారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం వేముగంటి సాహిత్య పీఠం ఆధ్వర్యంలో జరిగిన కవిత్వ పోటీల విజేతలకు బహుమతులను అందజేసి సాహిత్య పీఠం పక్షాన విద్యార్థులను ఘనం గా సన్మానించి ప్రశంసాపత్రాలు అందజేశారు. కా ర్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా నందిని సిధారెడ్డి మాట్లాడుతూ తెలుగు సాహిత్యానికి తన రచనలతో వన్నె తెచ్చిన పద్య కవి వేముగంటి నర్సింహాచార్యులు అని అన్నారు. ఆయన పేరిట సాహిత్య పీఠాన్ని ఏర్పాటు చేయ డం గొప్పదని చెప్పారు. భిన్న కోణాల్లో, ప్రక్రియల్లో సాహిత్యం వెలువరించాలని, ప్రధానంగా పిల్లల కోసం మంచి బాల సాహిత్యాన్ని అందించారన్నారు. బాల్యంలోనే పిల్లలకు సాహిత్య బీజా లు పడితే భవిష్యత్‌లో గొప్ప వ్యక్తులుగా రూపొందుతారన్నారు. బాల్యం గొప్ప దశ అని, నేడు ఆ దశ నిర్వీర్యమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేశా రు. వేముగంటి సాహిత్యం భవిష్యత్ తరాలకు అందించేందుకు వేముగంటి సాహిత్య పీఠం కృషి చేయాలని ఆకాంక్షించారు.

తెలుగు సాహిత్యం గర్వించదగ్గ కవి వేముగంటి నర్సింహాచార్యులు అని సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. చి న్నతనంలోనే తనలో సాహిత్య బీజాలను నాటిన వ్యక్తి వేముగంటి అని, పద్య సాహిత్యంలో ఆయ న భిన్న ప్రక్రియల్లో రచనలు చేశారన్నారు. సిద్దిపేట పేరును సాహిత్యంలో నలుదిశలా వ్యాపింపజేసిన వేముగంటి సాహిత్యంపై భవిష్యత్‌లో సభలు నిర్వహించాలన్నారు. పిల్లలు విషసంస్కృ తి బారిన పడకుండా సాహిత్యాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ప్రముఖ బాల సాహిత్యకారుడు వేదకుమార్ మాట్లాడుతూ పిల్లల్లో గొప్ప సృజనాత్మకతశక్తి ఉంటుందని, దాన్ని వెలికి తీ యాల్సిన బాధ్యత సాహిత్యకారులపై ఉందన్నా రు. బాల చెలిమి పేరిట సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. సాహిత్య వికాసానికి వేముగంటి నర్సింహాచార్యులు ఎనలేని కృషి చేశారని ప్రెస్ అకాడమీ సభ్యుడు కొమురవెల్లి అంజయ్య అన్నారు. వేముగంటి సాహిత్య పీఠం అధ్యక్షుడు రఘునందన్ అధ్యక్షతన సభ జరిగింది. కార్యక్రమంలో మంజీర రచయితల సంఘం అధ్యక్షుడు కే. రంగాచారి, కవులు తైదల అంజయ్య, వేముగంటి మురళి, గంగారాం, లకా్ష్మరెడ్డి, కుమార్, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...