సందడిగా చాముండేశ్వరి ఆలయం


Sun,November 3, 2019 11:16 PM

చిలిపిచెడ్ : చాముండేశ్వరి అమ్మవారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం మండలంలోని చిట్కుల్ గ్రామ శివారులో వెలసిన చాముండేశ్వరి ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని పలు ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం సమీపంలోని మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవారికి కుంకుమార్చనలు, ఒడిబియ్యం సమర్పించారు. ఆలయ ప్రధాన పూజరి ప్రభాకరశర్మ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...