పెద్ద చెరువు గలగలలు


Sat,November 2, 2019 11:40 PM

-నిండుకుండలా జలవనరు
-గోదావరి నీటితోపాటు భారీ వర్షాలతో వరద
-చుట్టుపక్కల పెరిగిన భూగర్భ జలమట్టాలు
-మినీట్యాంక్‌బండ్‌గా మార్చేందుకు రూ.3 కోట్లు మంజూరు
చేర్యాల, నమస్తే తెలంగాణ : గోదావరి జలాల రాకతో పాటు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలతో పట్టణంలోని పెద్ద చెరువు జలకళ సంతరించుకుం ది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి శ్రద్ధతో పెద్ద చెరువు నిండుకుండలా మారడంతో ప్రజల్లో ఆ నందం వ్యక్తమవుతున్నది. టీఆర్‌ఎస్ సర్కారు చేర్యాల పెద్ద చెరువుకు ఎంతో ప్రాధాన్యతనిస్తూ వస్తున్నది. రూ.3కోట్లతో మినీ ట్యాంక్ బండ్‌గా ఏర్పాటు చేసేందుకు గతంలోనే మంజూరు ఇచ్చి నిధులు విడుదల చేయడంతో కొంత మేరకు పను లు జరిగాయి. పట్టణవాసుల ఎంతో ఉపయోగపడే పెద్ద చెరువులోకి గోదావరి జలాలు విడుదల చేసేందుకు ఆదేశాలు ఇచ్చిన సీఎం కేసీఆర్‌తో పా టు జలాలను తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎమ్మె ల్యే ముత్తిరెడ్డికి పట్టణ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

టీఆర్‌ఎస్ పట్టణ నాయకుల అభ్యర్థన మేరకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పెద్ద చె రువులోకి గోదావరి జలాలను ఇటీవల పంపింగ్ చేయించడంతో, వారం రోజుల పాటు పట్టణంలోని ప్రధాన రహదారిపై అలుగుపారుతున్నది. గోదావరి జలాలకు తోడుగా వర్షాలు కురుస్తుండడంతో రోజు మత్తడి పడుడుతున్నది. పట్టణానికి ప్రధాన జలవనరుగా ఉన్న పెద్ద చెరువులోకి నీరు చేరితే పట్టణంలోని భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు మద్దూరు మండలంలోని నర్సాయపల్లి తదితర గ్రామాలకు ప్రయోజనం చేకూరనున్నది. ఇప్పటికే పట్టణంలోని పలు బోరుబావుల్లో నీటి మట్టం పెరిగినట్లు కాలనీవాసులు తెలుపుతున్నారు. పెద్ద చెరువులోకి నీరు చేరినప్పటి నుంచి బోరుమోటర్ ఆన్ చేయగానే ఎర్రరంగులో ఉన్న నీరు వస్తున్నదని పలువురు తెలిపారు.

టీఆర్‌ఎస్ సర్కారు పాలనలో మహర్దశ
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఎమ్మెల్యేగా ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఎన్నిక కావడంతో పెద్ద చెరువు దశ మారింది. మినీ ట్యాంక్‌బండ్‌గా ఏర్పాటు చేసేందుకు రూ.3కోట్లు మంజూరు చేయడంతో పాటు ప్రతి యేటా గోదావరి జలాలు నింపుతున్నారు. రెండేండ్ల క్రితం ఓ పర్యాయం పెద్ద చెరువులోకి గోదావరి జలాలు రావడంతో మత్తడి దూకింది. ప్రస్తుతం నీరు భారీగా చేరడంతో పెద్ద చెరువు మత్తడి పడుతుండడంతో పట్టణ సమీపంలోని కుడి చెరువులోకి వరద నీరు చేరింది. టీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు కుడి చెరువులోకి సైతం నీరు వచ్చేలా గత కాలంగా కాల్వలను సరి చేయించడంతో మత్తడి దూకే వరకు నీరు చేరింది. పెద్ద చెరువులోకి నీరు చేరడంతో సమీపంలోని బోర్లలో నీటి మట్టం పెరిగి, అవి కాస్తా ప్రెషర్‌గా నీళ్లు విడుదల చేస్తున్నాయని ఆయా వార్డుల ప్రజలు తెలుపుతున్నారు. పట్టణంలోని పెద్ద చెరువు మత్తడి దూకుతుండడంతో అధికార పార్టీ నాయకులతో పాటు ప్రతిపక్ష పార్టీల నాయకులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

73
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...