మూడో కన్ను నీడలో పల్లెలు


Sat,November 2, 2019 11:20 PM

పోలీసు వ్యవస్థను కొనసాగిస్తున్నది. కొందరు దుండగులు వివిధ నేరాలకు పాల్పడుతూ కోర్టుల్లో సరైన సాక్ష్యాలు నిరుపన కాకుండా బయటకు వచ్చి దర్జాగ సమాజంలో తిరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నేరాలకు పాల్పడిన వ్యక్తులకు సరైన శిక్షలు పడాలంటే రుజవులు బలంగా ఉండాలి. అమాయక ప్రజలను ప్రత్యక్ష సాక్షులుగా ఉంచకుండానే నేరాలను కోర్టుల్లో రుజువు చేయాలనే లక్ష్యంతో పోలీసు శాఖ ఏర్పాటు చేస్తున్న నిఘా నేత్రా (సీసీ కెమెరా) లపై ప్రత్యేక కథనం..

14 గ్రామాల్లో వంద శాతం సీసీ కెమెరాలు..
ప్రజల భాగస్వామ్యంతో పోలీసులు దొంగలు, నేరస్తుల నుంచి ప్రజలను ప్రతి క్షణం కాపాడుతూ, నిత్యం పిల్లాపాపలతో కలిసి సుఖసంతోషాలతో ప్రజలు జీవనం గడుపాలనే సంకల్పంతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజల సొమ్మతో ఏర్పాటు చేసిన ప్రతి వస్తువును తమ ఇంటి వస్తువుగా ప్రజలు కాపాడుతారనే ఉద్ధేశంతోనే పోలీసులు సీసీ కెమెరాలను దుబ్బాక సీఐ హరికృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎన్.విజయ భాస్కర్ నేతృత్వంలో ఏర్పాటు చేశారు. మిరుదొడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలో 14 గ్రామాలు ఉండగా మిరుదొడ్డిలో 12, కాలాసుబాద్‌లో 5, రుద్రారంలో 16, మల్లుపల్లిలో 8, లింగుపల్లిలో 3, చెప్యాలలో 10, అల్వాలలో 8, గోవర్దనగిరిలో 14, గుడికందులలో 10, వర్దరాజ్‌పల్లిలో 3, కొండాపూర్‌లో 5, ధర్మారంలో 10, అందెలో 12, లక్ష్మీనగర్‌లో 2తో కలిపి మొత్తం 118 సీసీ కెమెరాలు అమర్చారు.

సీసీ కెమెరాలతో నేరాలు అదుపులో..
సీసీ కెమెరాలను గ్రామాల్లో ఏర్పాటు చేయడంతో ఎలాంటి చిన్న గొడవలు సృష్టించిన తాము సీసీ కెమెరాల్లో బంది అవుతామనే భయం ప్రజల్లో నెలకొంది. ప్రజలు సీసీ కెమెరాల నిఘాలో నీడలో తమ పనులు తాము చేసుకుంటూ హాయిగా కుటుంబాలతో జీవనం గడుపుతున్నారు. ఒక్కొక్క సీసీ కెమెరా 13 మంది పోలీసు సిబ్బందితో సమానం. సీసీలు ఉదయం వేళలో 60 మీటర్ల దూరం, రాత్రి వేళలో 30 మీటర్ల దూరం వరకు పని చేస్తున్నాయి. అనుక్షణం 24 గంటల పాటు సీసీ కెమెరాలు గ్రామ ప్రజలకు రక్షణ కల్పిస్తూ తమ విధులు నిర్వహించడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తప్పు చేసిన వారికి తప్పకుండా శిక్ష పడుతుందని ఆనందంలో ప్రభుత్వానికి, పోలీసు శాఖకు గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా..
దేశంలోనే తెలంగాణ రాష్ర్టాన్ని శాంతి భద్రతల విషయంలో అగ్రస్థానంలో నిలిపింది. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పల్లెల్లో ప్రజలు సుఖ సంతోషమైన జీవనం గడుపాలనే సదుద్ధేశంతోనే నేర రహిత గ్రామాలుగా తీర్చిదిద్దడానికి సిద్దిపేట సీపీ జోయల్ డెవిస్ ఆదేశాలతో పోలీసు శాఖ వారు ప్రజాప్రతినిధుల, ప్రజల భాగస్వామ్యంతో 14 గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో వంద శాతం వరకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.


46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...