పోషకాహారం, వ్యాధులపై అవగాహన


Sat,November 2, 2019 11:18 PM

హుస్నాబాద్ రూరల్ : మండలంలోని కూచనపల్లిలో అంగన్‌వాడీ సెంటర్‌లో శనివారం పోషకాహారం, సీజనల్ వ్యాధులపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా హుస్నాబాద్ డివిజన్ కీటక జనిత వ్యాధుల నియంత్రణ అధికారి జీ.రామ్మూర్తి డెంగీ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ లేకుండా చూసుకుంటే దోమల లార్వాను నివారించవచ్చని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కేసీరెడ్డి రాంచంద్రారెడ్డి, ఎంపీటీసీ బానాల విజయ, ఆరోగ్య పర్యవేక్షకురాలు ఎలగొండమ్మ, హెల్త్ అసిస్టెంట్ సుగుణ, అంగన్‌వాడీ టీచర్ సీహెచ్ లలిత, ఆశ కార్యకర్త మంగ, గర్భిణులు పాల్గొన్నారు.

34
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...