పాడిపరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కృషి


Sat,November 2, 2019 11:17 PM

సిద్దిపేట అర్బన్: పాడి రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ప్రతి రైతు విజయ డెయిరీకే పాలు పోయాలని పశుగణాభివృద్ధి సంస్థ ఉమ్మడి మెదక్ జిల్లా చైర్మన్ లకా్ష్మరెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట విజయ డెయిరీ ఆవరణలో పాడి రైతులకు దాణా బ్యాగులను విజయ డెయిరీ మేనేజర్ గోపాల్‌సింగ్‌తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో లకా్ష్మరెడ్డి మాట్లాడుతూ పాడి పరిశ్రమను అభివృద్ధి పర్చడంతో పాటు పాడి రైతులకు చేయూతనివ్వాలనే ఉద్దేశంతో రైతులకు సబ్సిడీపై ప్రభుత్వం గేదెలను అందిస్తున్నదన్నారు. పాడి గేదెలు తీసుకున్న రైతులందరికీ ఉచితంగా 3 క్వింటాళ్ల దాణా బ్యాగులను అందిస్తున్నామన్నా రు. 380మంది రైతులు సబ్సిడీ గేదెలకోసం డీడీలు కట్టగా, ఇప్పటికే 100 మంది రైతులకు పాడి గేదెలను పంపిణీ చేశామన్నారు.

ఇతర రాష్ర్టాల నుంచి సబ్సిడీ గేదెలను తీసుకోవాలని సూచించారు. ఎస్సీలు, ఎస్టీలకు ప్రభుత్వం 75 శాతంపై సబ్సిడీ గేదెలను ఇస్తుండగా బీసీ, ఇతరులకు 50 శాతం సబ్సిడీపై ఇస్తున్నారన్నారు. పాడి గేదె కోసం రూ.80 వేలు ప్రభుత్వం కేటాయిస్తుండగా రైతులు సబ్సిడీ పోనూ రైతు వాటా చెల్లించాలన్నారు. ప్రస్తుతం 600 పాడి దాణా బ్యాగులను పంపిణీ చేశామన్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో పాడి రైతులకు ప్రోత్సాహం లభిస్తున్నదన్నారు. విజయ డెయిరీ మేనేజర్ గోపాల్‌సింగ్ మాట్లాడుతూ రైతులు అందరూ తప్పని సరిగా విజయ డెయిరీకే పాలు పోసి ప్రభుత్వ ప్రోత్సాహలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాణా బస్తాలను గ్రామాల్లో సంబంధిత ప్రజాప్రతినిధులో కలిసి పాడి రైతులకు అందజేయాలన్నారు.

42
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...