సత్వరమే సమస్యలు పరిష్కరించండి


Wed,October 23, 2019 10:57 PM

సిద్దిపేట రూరల్ : నీటి సమస్య అధికంగా ఉన్న ప్రా ంతాల్లో అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చై ర్ పర్సన్ రోజాశర్మ అధ్యక్షతన బుధవారం జిల్లా ప్ర జా పరిషత్ స్థాయి సంఘ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ రాఘవాపూర్ గ్రామంలో నీటి సమస్య అధికంగా ఉందని అధికారులు స్పందించాలన్నారు. హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మంచినీటి పైప్‌లైన్ చాలా సందర్భాల్లో లీక్ అయిందని తన దృష్టికి వచ్చిందని దాన్ని సత్వరమే బాగు చేసి, క్వాలిటీ పైప్‌లైన్ వేసి పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ పాఠశాలల్లో కాంపౌండ్ వాల్‌లను పూర్తి చేయాలన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా వివిధ పాఠశాలల్లో పాత బిల్డింగుల స్థానంలో కొత్త బిల్డింగులు ఏర్పాటు చేయాలని ఆదేశించినప్పటికీ కొత్త బిల్డింగులు ఏ ర్పాటు చేసి వాటిని అదే విధంగా వదిలివేయడం అధికారుల నిర్లక్ష్యానికి పరాకష్ట అని అధికారులపై ఆ గ్రహం వ్యక్తం చేశారు. బద్దిపడగ గ్రామంలో పాత స్కూల్ భవంతిని పడగొట్టక పోవడం తాను కొద్దిసేపటి క్రితమే గమనించానని, ఈ విషయమై స్థానిక స ర్పంచ్‌కు సూచించానన్నారు. గజ్వేల్ ఎడ్యుకేషన్ హ బ్‌లో, దవాఖానలో నీటి సమస్య అధికంగా ఉన్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు.

వెంటనే నీటి సమస్యను తీర్చాలని అధికారులను ఆదేశించారు. ఎంసీహెచ్‌ఆర్‌డీ రూ.3 కోట్లను విడుదల చేశాయని, వాటితో ఉపాధ్యాయ భవన్‌లో ఉపాధ్యాయులకు కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ త్వరిగతిన ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గతంలో పదో తరగతి ఉత్తీర్ణతలో రెండో స్థానంలో ఉన్నామని, ఈ సారి మొదటి స్థానం రావాలన్నారు. ఉదయం 11 గంటల సెషన్‌లో రెండోస్థాయి సంఘం సమావేశంలో గ్రామీణాభివృద్ధిపై, మధ్యాహ్నం 3 గంటలకు నాలుగోస్థాయి సంఘం సమావేశంలో విద్యా, వైద్యంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణాభివృద్ధిపై జరిగిన సమావేశంలో వివిధ శాఖల అధికారులు మాట్లాడుతూ జిల్లాలోని 23 మండల ప్రజాపరిషత్‌లకు సంబంధించి 1,95,334 జాబ్ కార్డులు జారీ చేయడం లేదని తెలిపారు. ఇప్పటి వరకు 90,217 కుటుంబాలకు 40,43,964 పని దినాలు కల్పించామన్నారు. ఇందులో 5,057 కుటుంబాలకు 100 రోజులు పనిదినాలు కల్పించామన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు కూలీలకు చెల్లింపుగా రూ.6513.41 లక్షలు చెల్లించామన్నారు. భూగర్భ జలాలు పెంచే దిశగా ఇంకుడు గుంతలు, సామూహిక ఇంకుడు గుంతలు ఏర్పాటు చేశామన్నారు. 436 డంపింగ్ యార్డులకు సంబంధించి పరిపాలన ఆమోదం పొంది 92 నిర్మాణాలు పూర్తయి, 103 పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు.

పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంతో కలిసి గ్రామాల్లో వైకుంఠధామం నిర్మిస్తున్నామని ఈ మేరకు 467 గ్రామాల్లో స్థల సేకరణ పూర్తి చేశామన్నారు. ఒక వైకుంఠధామం నిర్మాణం చేయడానికి పది లక్షల రూపాయలు కేటాయించామని తెలిపారు. 379 పనులకు పరిపాలన అనుమతి ఇవ్వగా 157 నిర్మాణాం పూర్తయి, 78 పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ప్రతి గ్రామంలో గొర్రెల పాక నిర్మాణానికి ఉపాధి హామీ నిధులు చెల్లిస్తున్నామన్నారు. 1009 గొర్రెల, మేకల షెడ్లు అనుమతులు పొందగా 320 పూర్తయి, 154 పురోగతిలో ఉన్నాయన్నారు. హరితహారం కార్యక్రమాన్ని వంద శాతం అమలు చేస్తున్నామని, జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, తెలంగాణ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో ఫించన్లు అందిస్తున్నామన్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 21 ప్రాథమిక వ్యవసాయ సంఘాల ద్వారా 54 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 20 భారీ పరిశ్రమలు రూ.6664.83 కోట్ల పెట్టుబడితో నెలకొల్పి 2,894 మందికి ఉపాధి కల్పించామని జిల్లా పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా 535 చేనేత మగ్గాలు పని చేస్తున్నాయని, వివిధ బ్యాంకుల ద్వారా రూ.1.40 కోట్లు మాఫీ అయ్యాయని చేనేత జౌళి అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో శ్రావణ్‌కుమార్, జడ్పీటీసీలు గాంధారి ఇంద్రసేనారెడ్డి, శ్యామల నాగరాజు, శెట్టి మల్లేశం, అనంతుల అశ్విని, గిరి కొండల్‌రెడ్డి, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...