రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు


Wed,October 23, 2019 10:57 PM

తొగుట : రైతులకు మద్దతు ధర అందించడానికే సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని తొగుట సొసైటీ చైర్మన్ కురాకుల మల్లేశం పేర్కొన్నారు. తొగుట వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం సొసైటీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వడ్లు పొలంలోనే ఎండబెట్టి, చెత్తా, చెదారం లేకుండా చూసుకొని మార్కెట్‌కు తీసుకురావాలని ఆయన కోరారు. ఏగ్రేడ్ ధాన్యానికి రూ.1835, బీ గ్రేడ్ ధాన్యానికి రూ. 1815 మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు వడ్ల కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో మార్కెట్ సిబ్బంది సునిల్, హమాలీలు, రైతులు పాల్గొన్నారు.

64
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...