సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలు తగ్గుముఖం


Wed,October 23, 2019 10:57 PM

తొగుట : తొగుట పోలీస్ స్టేషన్ పరిధిలో అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేస్తున్నామని తొగుట సీఐ, ఎస్‌ఐలు రవీందర్, శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తుక్కాపూర్, పెద్దమాసాన్‌పల్లి గ్రామాల్లో సీసీ కెమెరాలు ప్రారంభించారు. నేనుసైతం అనే కార్యక్రమం ద్వారా ప్రజా ప్రతినిధులు, దాతల ప్రోత్సాహంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని వారు తెలిపారు. పెద్దమాసాన్‌పల్లిలో 6, తుక్కాపూర్‌లో 7 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలను పోలీస్ స్టేషన్ కంప్యూటర్ వ్యవస్థతో అనుసంధానం చేస్తామని, గ్రామంలో ఏం జరుగుతుందో అనుక్షణం తెలుస్తుందన్నారు. నిఘా వ్యవస్థ పెరుగడం ద్వారా నేరాలు, ఘోరాలు తగ్గుముఖం పడుతాయన్నారు. సీసీ కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజా ప్రతినిధులు సహకారం అందించాలని వారు కోరారు. గ్రామాల్లో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడినా, బెల్టు షాపులు నిర్వహించినా, గుట్కాలు అమ్మినా, పేకాట ఆడినా 100కు, 7901100100 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వారు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు మెట్టు వరలక్ష్మి స్వామి, చిక్కుడు చంద్రం, ఎంపీటీసీ మాష్టి సుమలత, ఉప సర్పంచ్ రాజిరెడ్డి, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

47
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...