పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు


Mon,October 21, 2019 11:26 PM

-కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి
కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి పర్చేందుకు నూతన పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి త్వరితగతిన వివిధ శాఖల నుంచి అనుమతులు ఇప్పించడం కోసం అధికారులు కృషి చేయాలని కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డి అన్నారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా పారిశ్రామిక అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ మేనేజర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, టీఎస్‌ఐఐసీ మేనేజర్‌తో పాటు హెచ్‌ఎండీఏ ఏపీవో, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, ఏఈఈ డీటీసీపీవో తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 43 పరిశ్రమలకు 49 అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు.

వెంకటేశ్వర కాటన్ ఇండస్ట్రీస్, మధుశ్రీ సిమెంట్ బ్రిక్స్ మొదలైన పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందించారు. ఎస్సీ, ఎస్టీలకు టీప్రైడ్ పథకం కింద 3 వికలాంగుల యూనిట్లకు రూ.5,64,761, ఎస్సీలకు సంబంధించిన 27 యూనిట్లకు రూ.59,85,669, ఎస్టీలకు సంబంధించిన 10 యూనిట్లకు రూ.25,23,155 మంజూరు చేశారు. పావలా వడ్డీ పథకం కింద ఒక వికలాంగ యూనిట్‌కు రూ.13,943, ఎస్సీలకు సంబంధించిన 11 యూనిట్లకు రూ.2,13,880, ఎస్టీలకు సంబంధించిన 4 యూనిట్లకు రూ.66,228 మంజూరు చేశారు.

90
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...