కార్యాచరణతో గ్రామాలకు కొత్తకళ


Sat,October 19, 2019 11:24 PM

గజ్వేల్ రూరల్ : కార్యాచరణతో గ్రామాలన్నీ కొత్తకళను సంతరించుకున్నాయని జడ్పీటీసీ పంగమల్లేశం అన్నారు. శనివారం పిడిచెడ్‌లో డంపింగ్ యార్డుకు స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భం గా జడ్పీటీసీ మల్లేశం మాట్లాడుతూ కార్యాచరణ తర్వాత గ్రామాలన్నీ పరిశుభ్రంగా, పచ్చగా మారాయన్నారు. సర్పంచ్‌తో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా ఇదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే ప్రజలకు ఎలాంటి వ్యాధులు రావన్నారు. కార్యక్రమంలో ప్రత్యేకాధికారి యాదగిరి, సర్పంచ్ మన్నె శిల్ప పాల్గొన్నారు.

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు..
జగదేవపూర్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తీగుల్‌నర్సాపూర్ సర్పంచ్ రజిత అన్నారు. శనివారం తీగుల్‌నర్సాపూర్‌లో ఉపసర్పంచ్ సురేందర్‌రెడ్డి వార్డుసభ్యులు కోఆప్షన్ సభ్యులతో కలసి గ్రామస్తులకు తడి-పొడి చెత్త వేరు చేసే లా చెత్తబుట్టలను పంపిణీ చేశారు. ఇప్పటికే గ్రామంలో ప్లాస్టిక్ వ్యర్థాలను నిషేధిండంతో పాటు చెత్తబుట్టల పంపిణీ ద్వారా పారిశుధ్య నిర్వహణ పకడ్బందీగా చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎక్కడ పడితే అక్కడ చెత్తవేయకుండా తడిపొడి చెత్తను వేరు చేసి పారిశుధ్య సిబ్బంది చెత్తబండిలో వేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాంరెడ్డి, వార్డు సభ్యులు కుమార్, నాయకులు స్వామి, కిషన్, దేశిరెడ్డి, పాల్గొన్నారు.

డంపుయార్డు పనులు ప్రారంభం..
జగదేవపూర్ :ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా శనివారం మండలంలోని చిన్నకిష్టాపూర్‌లో సర్పంచ్ కర్రోల్ల కనకయ్య డంపుయార్డు నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు.. గ్రామ సంపూర్ణ అభివృద్ధిలో భాగంగా పారిశుధ్యం పచ్చదనానికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. ఇందులో భాగంగానే గ్రామంలో డంపుయార్డు నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉసర్పంచ్ రాజిరెడ్డి, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, సంతోశ్, ఆర్‌ఐ బాలకృష్ణ పలువురు నాయకులు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...