పోలీసు విధులపై అవగాహన


Fri,October 18, 2019 10:45 PM

జగదేవపూర్ : పోలీసుల విధులపై విద్యార్థులకు అవగాహన ఉండాల్సిన అవసరముందని ఏఎస్‌ఐ కృష్ణంరాజు అన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం మండల కేంద్రంలోని ఠాణాలో ఓపెన్ హౌస్ నిర్వహించి శ్రీ చైతన్య హైస్కూల్ విద్యార్థులకు స్టేషన్‌లో ఉన్న ఆయుధాలను చూపించి వాటి పనితీరును విద్యార్థులకు తెలియచేశారు. పలు రికార్డులు సెక్షన్లను గూర్చి విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలో విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ నర్సింహారెడ్డి, హెడ్‌కానిస్టెబుల్ పర్వేజ్, భాస్కర్, హిమవంతరావు పాల్గొన్నారు.

61
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...