వరి పంట పరిశీలన


Thu,October 17, 2019 11:30 PM

నిజాంపేట : మండల పరిధిలోని నందిగామ గ్రామంలో నర్సింహారెడ్డికి చెందిన వరిపంట, మామిడితోటను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి పరుశురాంనాయక్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణం మబ్బులతో చల్లగా ఉండటం వల్ల రైతులు పండించే పంటలకు తెగులు వస్తున్నాయని, తగిన జాగ్రత్తల వల్ల పంటలను సంరక్షించుకోవచ్చని తెలిపారు. ముఖ్యంగా అగ్గితెగులు వల్ల వరిపంటలో గణనీయంగా దిగుబడి తగ్గిపోతుందని ఈ వ్యాధి నివారణకు ట్రైసైక్లోజోల్ 100గ్రా. ఒక ఎకరానికి 200లీటర్ల నీటిని కలుపుకుని పిచికారి చేసుకోవాలన్నారు. మామిడితోటకు ఆశించిన ఆకుమచ్చ తెగులు నివారణకు బవిస్టన్ 200గ్రా. ఒక ఎకరానికి 200లీటర్ల నీటిలో కలుపుకుని పిచికారి చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారి రాజు ఉన్నారు.

59
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...