ఆసరా లబ్ధిదారుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు


Thu,October 17, 2019 11:30 PM

మెదక్ కలెక్టరేట్ : జిల్లాలోని ఆసరా లబ్ధిదారుల సౌలభ్యం కోసం ప్రత్యేకంగా కాల్‌సెంటర్‌ను ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ ధర్మారెడ్డి జిల్లా ప్రజలకు సూచించారు. పింఛన్ కోసం ప్రజలు నిరంతరం అనేక వ్యయ ప్రయాసలకు ఓర్చి మండల కార్యాలయాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు తిరుగుతున్నారని తెలిపారు. ఇలాంటి కష్టాలను తగ్గించేందుకుగాను జిల్లాస్థాయిలో ప్రత్యేక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత అధికారి విచారణ తర్వాత వెబ్ పోర్టల్‌లో పరిష్కార సమాచారాన్ని నమోదు చేస్తారన్నారు.ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. 08452-222856 నంబర్‌కి ఫోన్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా వాల్ పోస్టర్, స్టిక్కర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో సీతారామారావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏపీడీ బీమయ్య, డీపీఎం ప్రకాశ్, ఏపీఎం మెర్సినా, సిబ్బంది ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...