ఇబ్రహీంపూర్‌లో విదేశీయుల బృందం


Thu,October 17, 2019 11:29 PM

నారాయణరావుపేట : మండలంలోని ఇబ్రహీంపూర్ గ్రామాన్ని 8 దేశాలకు చెందిన 16 మంది అధికారులు గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఇంకుడు గుంతలు, డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, పార్కు, స్వచ్ఛ విద్యాలయ అవార్డు అందుకున్న ప్రాథమిక పాఠశాల, పందిరి సాగు విధానం, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం, హరితహారం మొక్కలు, సామూహిక గొర్రెల షెడ్లను సందర్శించి, పరిశీలించారు. అనంతరం స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశమై అభివృద్ధి పనుల జరిగిన తీరుపై విదేశీ అధికారులు చర్చించారు. ఇక్కడ జరిగిన అభివృద్ధి చాలా బాగుందని కితాబు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ దేవయ్య, పంచాయతీ సెక్రటరీ మనోహర్‌రెడ్డి, నాయకుడు నగేశ్, గ్రామస్తులు ఉన్నారు.

49
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...