ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు


Thu,October 17, 2019 12:12 AM

చేర్యాల, నమస్తే తెలంగాణ : కాంగ్రెస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ వారి సిద్ధాంతాలను పక్కన పెట్టి, అధికారమే పరమావధిగా ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆరోపించారు. చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువులోకి బుధవారం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి చేపపిల్లలను వదిలిపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు ఎన్ని జట్లు కట్టిన ప్రజలు వారిని పట్టించుకోవడం లేదని, హుజూర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు అధికారం కోసం గోతికాడ నక్కలవలే కూర్చున్నారని, చిన్న సమస్యను పెద్దదిగా తయారు చేసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ అన్ని వర్గాలను ఆందోళనకు గురి చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ర్టానికి దేవుడిచ్చిన వరమని, ఆయన పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు సంతోషంగా జీవనం సాగిస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రజల జీవన విధానంలో మార్పులు తీసుకువచ్చి, రైతులు అప్పుల నుంచి విముక్తి అయి ఇతరులకు వారు అప్పులిచ్చే స్థాయికి ఎదిగేందుకు ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

ఎంపీపీ ఉల్లంపల్లి కరుణాకర్, వైస్ ఎంపీపీ తాండ్ర నవీన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ముస్త్యాల బాల్‌నర్సయ్య, జిల్లా రైతు కమిటీ సభ్యులు శ్రీధర్‌రెడ్డి, ఆగంరెడ్డి, టౌన్ కార్యదర్శి హరి, నాయకులు పాల్గొన్నారు. అలాగే, ఆకునూరు గ్రామానికి చెందిన కోతి ప్రశాంత్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆయన కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మద్దూరు ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మేక సంతోష్ తదితరులున్నారు.ఆత్మీయ కలయిక ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర కమిషన్ చైర్మన్ ఎర్రోల్ల శ్రీనివాస్ చేర్యాల-ఆకునూరు రహదారిలో అకస్మాత్తుగా ఎదురుకావడంతో ఆయనను జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఆత్మీయ అలింగనం చేసుకున్నారు. ఇరువురు కుశల ప్రశ్నలు వేసుకోవడంతో పాటు దళితులకు న్యాయం చేసేందుకు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే అభినందించారు.

63
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...