చేయి,చేయి కలిపారు..ఆదర్శంగా నిలిపారు


Tue,October 15, 2019 11:52 PM

తొగుట : సర్కారు పాఠశాల అంటేనే మనకెందుకులే..ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం, పాలకులు చూస్తారులే అనుకుంటున్న ప్రస్తుత కాలం ఇది. ప్రభుత్వం మీదనే ఆధారపడక చిన్నపాటి వసతులు కల్పించుకోవాలని తలంచిన ఒక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంకల్పానికి దాతలు అండగా నిలిచారు. పాఠశాల అభివృద్ధికి పెద్ద మొత్తంలో ప్రోత్సాహం అందించడంతో కళ్లారా చూసిన ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సైతం తన వంతుగా రూ. 51వేలను ప్రోత్సాహకంగా అందించారు. వివరాల్లోకి వెళ్తే మండలంలోని ఘనపూర్ జిల్లా పరిషత్ పాఠశాలలో పలు సమస్యలు ఉండడంతో గత సంవత్సరం వాటి పరిష్కారం కోసం ప్రధానోపాధ్యాయుడు గన్నె రాజిరెడ్డి ప్రజలను భాగస్వామ్యం చేయాలని తలచాడు.

అప్పటి గ్రామ సర్పంచ్ అక్కం స్వామి, మండల ఉపాధ్యక్షులు పుల్లగూర్ల ఎల్లారెడ్డి సహకారంతో పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాఠశాలలో నెలకొన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ప్రధానోపాధ్యాయుడి చొరవకు ముచ్చట వేసిన పలువురు దాతలు ముందుకు వచ్చి పాఠశాలలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం, విద్యార్థులకు అదనపు సౌకర్యాలు అందించడానికి ముందుకు వచ్చారు. కొండపాక మండలం మర్పడగ గ్రామానికి చెందిన దొంతి మల్లారెడ్డి ఆయన ద్వారా పోడియం నిర్మాణానికి మొదట రూ.2000 సేకరించారు. ములుగు జిల్లా పరిషత్ పాఠశాలలో పీడీగా పనిచేస్తున్న ఏ.విజయ కృష్ణ రూ.లక్ష విలువైన క్రీడా దుస్తులు విద్యార్థులకు అందించి ఔన్యత్యాన్ని చాటుకున్నారు. గ్రామానికి చెందిన పుల్లగూర్ల తిమ్మారెడ్డి స్టేజీ నిర్మాణానికి రూ.25 వేలు, విద్యార్థులకు రూ.10 వేల విలువైన నోట్‌బుక్స్ రూ.4 వేలతో బ్యాండ్ అందించారు.

నాటి మండల ఉపాధ్యక్షుడు ఎల్లారెడ్డి రూ. 10వేలతో మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, సరస్వతీ మాత గద్దె నిర్మాణం కోసం రూ.11 వేలతో పాటు వన భోజనం కోసం సహకారం అందించారు. నాటి సర్పంచ్ అక్కం స్వామి టై, బెల్టు, బ్యాడ్జ్‌ల కోసం రూ.5వేలు, టైల్స్ కోసం రూ.5 వేలు, అన్నదానం కోసం రూ.11 వేలు అందించారు. గంటా రవీందర్ రూ. 11,300 అందించి క్రీడా యూనిఫామ్‌లు సమకూర్చారు. ప్రస్తుత సర్పంచ్ కుంభాల వెంకటమ్మ కుమారుడు శ్రీనివాస్ రూ. 35వేలతో విద్యార్థులకు నోట్ బుక్స్ అందించారు. పాఠశాల పూర్వ ఉపాధ్యాయులు లక్కిరెడ్డి రామక్రిష్ణారెడ్డి సురక్షిత తాగునీటి కోసం రూ. 25 వేలతో వాటర్ ప్యూరిఫయర్, కంప్యూటర్, వాటర్ బబుల్స్ అందించారు. తమ తండ్రి పుల్లగూర్ల చంద్రారెడ్డి స్మారకార్ధం కుమారుడు రాజిరెడ్డి 6,7వ తరగతులకు రూ.20 వేలతో వాల్ పెయింటింగ్స్ వేయించారు. సిద్దిపేట లయన్స్ క్లబ్, బీమా హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో రూ.లక్ష విలువైన 100 స్కూల్ బ్యాగులు అందించారు. సిద్దిపేట బీఎంఆర్ కళాశాలల ద్వారా రూ.3,300తో దీపారాధన చెమ్మను అందించారు. శ్రీ జాన సరస్వతి ట్రస్ట్ నంది వనపర్తి వారు రూ.25వేలతో సరస్వతీ మాత విగ్రహం అందించడంతో పాఠశాలలో ఏర్పాటు చేశారు. పుల్లగూర్ల నర్సింహ్మారెడ్డి, అక్కం చంద్రకళ, దేవయ్య గుడి గోపురంకు రూ. 15 వేలు అందించారు. కుంభాల భాస్కర్ రూ.10వేల విలువైన డిజిటల్ సీడీలు అందించారు. యాటెల్లి రాజు రూ.8వేలతో 4 కార్పెట్‌లను అందించారు.

గంప రమేశ్, గాందాని శ్రీనివాస్, ముద్దం శ్రావణ్ కుమార్‌రెడ్డిలు షూ, పెన్నులు, ప్యాడ్‌లు అందించారు. గంగసాని రాజిరెడ్డి కార్యక్రమాల్లో సహకారం అందించారు. ముద్దం మల్లారెడ్డి కుమారుడు అశోక్‌రెడ్డి విద్యార్థులకు ఐడీ కార్డులు అందించారు. అక్కం చంద్రకళ దేవయ్య మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లు, ఏ. రవిందర్ క్రికెట్ కిట్ అందించారు. దాతల సాయంతో పాఠశాల అభివృద్ధి కోసం హెచ్‌ఎం గన్నె రాజిరెడ్డి చేస్తున్న కృషిని చూసి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డీఈవో రవికాంతారావు ఆయనను అభినందించడంతో పాటు పాఠశాల అభివృద్దికి సహకారం అందించారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి క్రికెట్ కిట్, డీఈవో రవికాంతారావు స్కూల్ షూల కోసం రూ. 5,600 అందించారు. మొత్తం మీద దాతల సాయంతో ఘనపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అన్ని రకాల సౌకర్యాలు సమకూరుతున్నాయి. విద్యార్థులకు సౌకర్యాల కల్పనలో ఘనపూర్ పాఠశాల ఆదర్శంగా నిలుస్తుంది. గత కొద్ది రోజుల క్రితం సత్యసాయి ట్రస్టు వారి ఆధ్వర్యంలో పాఠశాలలో విద్యార్థులకు అల్పాహార భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

చదువులోనూ ముందు వరుసలోనే..
వసతుల కల్పనలో ముందు వరుసలో ఉన్న ఘనపూర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు చదువులు, క్రీడలలో ముందు వరుసలో నిలుస్తూ ఔరా అనిపిస్తున్నారు. గత పదో తరగతిలో 19 మంది విద్యార్థుల్లో గొట్టం శృతి 9.8తో మండలంలో ముందు వరుసలో నిలువగా, 13 మంది 9 పాయింట్లు కన్నా ఎక్కువ సాధించారు. క్రీడల్లో డార్జ్‌బాల్‌లో స్వామి జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించగా, రాష్ట్ర స్థాయిలో కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, డార్జ్‌బాల్ క్రీడల్లో పాల్గొన్నారు. సైన్స్‌ఫేర్‌లో జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనపర్చారు.

57
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...