సజావుగా ప్రయాణం


Mon,October 14, 2019 12:50 AM

-తొమ్మిదో రోజూ బస్సులు యథాతథం
-జిల్లాలో కానరాని ఆర్టీసీ సమ్మె ప్రభావం
-సెలవు రోజూ తగ్గని ప్రయాణికులు
-అన్ని సౌకర్యాలు కల్పిస్తున్న అధికారులు

సిద్దిపేట టౌన్: ఆర్టీసీ బస్సులు ప్రయాణికులను ఎప్పటి మాదిరిగానే గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. తొమ్మిది రోజులుగా ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్నప్పటికీ ఆ ప్రభావం కనిపించకుండా అధికారులు చేపట్టిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సత్ఫలితాలనిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని రూట్లలో బస్సులు యథావిధిగా నడిచాయి. రద్దీకి అనుగుణంగా బస్సు సర్వీసులను అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా సమయానుకూలంగా బస్సులను నడుపుతున్నారు. దసరా పండుగకు వెళ్లి తిరిగి ఇండ్లకు చేరుకుంటున్న వారికి ఇబ్బందులు కలుగకుండా తిరుగు ప్రయాణంలో అసౌకర్యం కలుగకుండా చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక డిపోలున్నాయి. ఆదివారం ఆర్టీసీ బస్సులతో పాటు అద్దె ప్రైవేటు బస్సులు కలుపుకొని 341 వాహనాలు తిరిగాయి. సిద్దిపేట డిపో పరిధిలో 49 ఆర్టీసీ బస్సులు, దుబ్బాకలో 23, హుస్నాబాద్‌లో 35, గజ్వేల్‌లో 48 మొత్తం 155 ఆర్టీసీ బస్సులు జిల్లా వ్యాప్తంగా తిరిగాయి. హైర్‌విత్ 69, సీసీ బస్సులు 24, ఈఐబీఎస్ 13, మ్యాక్స్ క్యాబ్ 80 ఇలా మొత్తం 341 బస్సులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చాయి.

డిపోల వద్ద గట్టి బందోబస్తు
సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ నాలుగు డిపోలు, బస్టాండ్ల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రయాణిలకులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. ఆర్టీసీ కార్మికులు బస్సులకు అడ్డురాకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశాంత వాతావరణంలో బస్సులు నడిపేలా పర్యవేక్షణ చేపట్టారు. సమయానికి బస్సు సౌకర్యం కల్పించేలా ఎప్పటికప్పుడు ఆర్టీసీ అధికారులతో మాట్లాడుతూ ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగస్వాములయ్యారు. జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి గజ్వేల్ ఆర్టీసీ డిపో పరిధిలోని ప్రయాణికుల కోసం ప్రైవేటు ట్రావెల్స్‌ను మాట్లాడి బస్సులను నడిపే డ్రైవర్లను నియమించారు. అందుకు సంబంధించిన ధ్రువపత్రాలను ఆయన పరిశీలించారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. కాగా, సమస్య పరిష్కరించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ డిపోల వద్ద కండక్టర్లు, డ్రైవర్లు, కార్మికులు నిరసనలు వ్యక్తం చేశారు. మౌనదీక్షను చేపట్టారు. ఆర్టీసీ కార్మికులకు పలువురు సంఘీభావం తెలిపారు.

స్పీడ్ పెంచిన ఆర్టీసీ
దుబ్బాక టౌన్ : దుబ్బాక ఆర్టీసీ బస్సు డిపో నుంచి క్రమక్రమంగా బస్సుల సంఖ్య ను అధికారులు పెంచుతున్నారు. సమ్మెకు ముందు ఉన్న మాదిరిగా అన్ని రూట్లలో బస్సులను తిప్పేందుకు చర్యలు చేపట్టారు. డిపోలోని మొత్తం 38 బస్సులకు గానూ 29 బస్సులను ఆదివారం వివిధ రూట్లలో తిప్పినట్లు డిపో ఇన్‌చార్జి వాసురాం నాయక్ తెలిపారు. అన్ని రూట్లలో ప్రయాణికులకు రద్దీకి అనుగుణంగా ట్రిప్పులను పెంచుతున్నామన్నారు. రోజు వా రీగా లక్షా 20వేల ఆదాయం డిపోకు వస్తున్నదన్నారు. త్వరలోనే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో మాదిరిగా ప్రయాణికులకు టికెట్‌ను ఇచ్చే విధానాన్ని అమలు చేస్తామన్నారు. తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లతో బస్సులను యథావిధిగా నడుపుతున్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా అధికారులు చర్యలు చేపట్టారు. దుబ్బాక సీఐ హరికృష్ణ నేతృత్వంలో డిపో వద్ద, బస్‌స్టాండ్‌లో బందోబస్తు నిర్వహిస్తున్నారు. దుబ్బా క-సిద్దిపేట, దుబ్బాక-సికింద్రాబాద్, దుబ్బాక- కామారెడ్డి రూట్లలో ఎక్కువ బస్సులను తిప్పుతున్నామన్నారు. ఇది ఇలా ఉంటే దుబ్బాకలో ఆర్టీసీ కార్మికులు ఖమ్మంలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ కార్మికుడు శ్రీనివాస్‌రెడ్డి మృతికి సంతాపం ప్రకటించారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...