‘పేట’ను క్రీడా వేదికగా మారుస్తా


Sun,October 13, 2019 12:15 AM

సూర్యాపేటటౌన్‌ : సూర్యాపేటను రాష్ట్ర స్థాయి క్రీడా వేదికగా మారుస్తానని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి 6వ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలను శనివారం ఉదయం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడంలో తెలంగాణ ప్రభుత్వం ముం దువరుసలో ఉంటుందన్నారు. 2014 తరువాత అనేక క్రీడాపోటీలకు సూర్యాపేట వేదికగా నిలిచిందన్నారు. క్రీడలు విద్యార్థుల్లో మానసిక ఎదుగుదలకు దోహదపడుతాయన్నారు. క్రీడలు జీవితం లో ఎలా జీవించాలో నేర్పుతాయన్నారు. అం తర్జాతీయ ప్రమాణాలతో క్రీడా మైదానాల ఏర్పా టుకు కృషి చేస్తానన్నారు. క్రీడా స్ఫూర్తి లోపించడం వల్ల విద్యార్థుల్లో మానసిక ైస్థెర్యం కోల్పోతున్నారన్నారు. చదువులకంటే కూడా క్రీడలు రుగ్మతలను రూపుమాపేందుకు తో డ్పడుతాయన్నారు. జీవితాన్ని నేర్పేది క్రీడలే అని ఒక ఓటమి నుంచే గెలుపు పుడుతుందన్న అంశాన్ని విద్యార్థులు నేర్చుకోవాలన్నారు. ఓటమి జీవితానికి చివరిది కాదని ఆయన క్రీడాకారులకు సూచించారు.

సూర్యాపేట జిల్లాను రాష్ట్ర, దేశ స్థాయిలో గుర్తుండే విధంగా నావంతు సహకారం అందిస్తానన్నారు. అనంతరం క్రీడల నిర్వహణకు సహకరించిన సుధాకర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌ మీలా మహదేవ్‌ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తేరా చిన్నపరెడ్డి, నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, జడ్పీ వైస్‌ చైర్మన్‌ గోపగాని వెంకటనారాయణగౌడ్‌, మీలా మహదేవ్‌, సారంగపాని, రమేష్‌, రవీంద్రచారి, మహేందర్‌, రాజేష్‌కుమార్‌, వెంకటేష్‌రెడ్డి, శంకర్‌, మనోహర్‌, గడ్డం వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు వేమిరెడ్డి నర్సింహారెడ్డి, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయులు యు.రత్నయ్య, పి.మల్లే ష్‌, కిరణ్‌కుమార్‌, మైసయ్య, ఎల్‌. సైదు లు, శ్రీనివాస్‌, ధనమూర్తి, కె.శ్రీనివాస్‌, టి.హనుమంతరావు, డి.మ ల్లయ్య, ఎం. శ్రీనివాస్‌, ఎల్‌.రవి, ఎం.వీర య్య, విక్రంరెడ్డి, దాసయ్య, సైదానాయక్‌, యాకయ్య, గోవిందరెడ్డి, శ్రీధర్‌, ఆర్‌.సైదులు, కె.రవి, కృష్ణా రెడ్డి, సునీత, ప్రమీల, కలమ్మ, అనిత, విజయలక్ష్మి, సరస్వతి పాల్గొన్నారు.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...