సాఫీగా నడిచిన ఆర్టీసీ బస్సులు


Sun,October 13, 2019 12:14 AM

కోదాడఅర్బన్‌ / భానుపురి : దసరా పండుగకు వచ్చి తిరిగి వెళ్తున్న ప్రయాణికులకు ఎలాంటి ఆటంకం లేకుండా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 8రోజులుగా సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికుల లోటుకు అనుగుణంగా ప్రభుత్వ చర్యలతో బస్సులు సాఫీగా నడుస్తూనే ఉన్నాయి. రద్దీకి అనుగుణంగా బస్సులు నడుపుతుండడంతో ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. కోదాడలో ఉదయం 6 గంటల నుంచి డిపో నుంచి ప్రజా రవాణాను ప్రారంభించారు. ముందుగా కోదాడ రవాణా శాఖ అధికారి సుభాష్‌ తాత్కాలిక డ్రైవర్లకు సామర్థ్ధ్య పరీక్షలు నిర్వహించి పరిశీలించారు. బ్రీత్‌ ఎనలైజర్‌ ద్వారా డ్రైవర్లకు మ ద్యం తనిఖీలు నిర్వహించారు. అధిక ఛార్జీలు వ సూలు చేసిన తాత్కాలిక డ్రైవర్లు,కండక్టర్లను తొలగించామని తిరిగి విధులకు తీసుకోబోమని మేనేజర్‌ రాజీవ్‌ ప్రేమ్‌ కుమార్‌ తెలిపారు. శనివారం జిల్లా వ్యాప్తంగా రెండు డిపోల పరిధిలో బస్సులు ఇలా నడిచాయి. కోదాడ డిపోలో 91బస్సులకు 60 ఆర్టీసీవి, 31 అద్దె బస్సులు ఉండగా 42ఆర్టీసీ, 31అద్దె బస్సులు నడిచాయి. మొత్తంగా 88 బ స్సు సర్వీసులు కొనసాగించారు. అదేవి ధంగా సూర్యాపేట డిపోలో 119 బస్సుల్లో 74ఆర్టీసీ, 45 అద్దెబస్సు లు ఉండగా 67ఆర్టీసీ, 45అద్దె బస్సులు నడిచాయి. వీటితోపాటు రవాణా శాఖ పర్మిషన్‌తో కోదాడలో 15, సూర్యాపేటలో 27స్కూల్‌ బస్సులను నడిపించారు. మరోవైపు కార్మికుల ఆం దోళన లు కొనసాగుతుండ పలు సంఘాలు మద్దతు ప్రకటించాయి.

41
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...