మార్కెట్‌కు పెరిగిన పెసర్ల రాక ..


Sun,October 13, 2019 12:14 AM

సూర్యాపేట వ్యవసాయం : సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పెస ర్ల కొనుగోలు కేంద్రానికి వారం రోజుల తరువాత కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ఉమ్మడి జిల్లాలో ఒకే కొనుగోలు కేంద్రం కావడంతో ఇతర ప్రాంతాలైన నకిరేకల్‌, నల్లగొండ, మిర్యాలగూడ, తిరుమల గిరి ఇలా అనేక ప్రాంతాల నుంచి శనివారం మార్కెట్‌కు పెసర్ల రాక పెరిగింది. ప్రభుత్వ మద్దతు ధర రూ.7,050 రైతులకు అందిస్తుండడంతో ప్రభుత్వానికి అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో ప్ర భుత్వ కొనుగోలు కేంద్రానికి అమ్మేందుకు ఎదురు చూస్తున్న రైతులు శుక్రవారం 3,105 బస్తాలను 130మంది రైతుల నుంచి కొనుగోలు చేశారు. శనివారం ఉమ్మడి జిల్లానుంచి 125మంది రైతుల నుం చి సుమారు 3,500బస్తాలను కొనుగోలు చేశారు. మద్దతు ధర అందుతుండడంతో రెండు రోజుల్లోనే 6,605 బస్తాలను రైతులు తీసుకువచ్చారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు గాను వెంటనే బస్తాలను అందించి చకచకా కాంటాలను పూర్తి చేయిస్తున్నారు. పెసర్ల నాణ్యతా ప్రమాణాలు చూసేందుకు జిల్లా అధికారుల సూచనల మేరకు ముగ్గురు సభ్యులతో వ్యవసాయ అధికారి, వీఆర్‌ఓ, నాణ్యతాప్రమాణాల అధికారులను ఏర్పాటు చేసి వారి సూచనల మేరకు కొనుగోలు చేస్తున్నారు.
ఎగుమతుల ఆలస్యం : మార్కెట్‌కు రైతులు తీ సుకు వచ్చిన పెసర్లను అధికారులు నాణ్యతా ప్రమాణాల ఆధారంగా కొనుగోలు చేస్తున్నారు. కానీ కొనుగోలు చేసిన పెసర్లను నిల్వ ఉంచేందుకు ఏర్పాటు చేసిన సీడబ్యూసీలో వరుస సెలవుల కారణంగా ఎ గుమతులు కొంత ఆలస్యం అవుతున్నాయి. ఎగుమతుల ఆలస్యం అవుతున్నప్పటికీ రైతులకు ఎటువం టి ఇబ్బంది లేకుండా అధికారుల పర్యవేక్షణలో కొనుగోలు చేసిన బస్తాలను భద్రపరుస్తున్నారు.
నాణ్యతా ప్రమాణాలు : మార్కెట్‌కు పెసర్లను తీసుకువచ్చే రైతులు కచ్చితంగా అధికారులు సూ చించిన విధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. నాణ్యత కలిగిన వాటిని మాత్రమే కొనుగోలు చేస్తామని అన్నారు.

1) 12 శాతం కంటే తక్కువ తేమ ఉండే విధంగా చూసుకోవాలి.
2)ఇతర పదార్థాలు 2శాతం కంటే మించకూడదు.
3)పగిలిన గింజలు 3శాతానికి మించకుండా ఉండాలి.
4)రంగుపోయిన గింజలు 4శాతం మించకుండా ఉండాలి.
5)పురుగు పట్టిన గింజలు 4శాతం మించకుండా ఉండాలని సూచించారు. పై ప్రమాణాలు కలిగిన పెసర్లకు ప్రభుత్వం సూచించిన విధంగా మద్దతు ధరను అందించనున్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...