ఊపందుకున్న మద్యం దుకాణాల దరఖాస్తులు


Fri,October 11, 2019 11:07 PM

సిద్దిపేట టౌన్ : సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ పరిధిలో మద్యం దుకాణాల ఏర్పాటుకు ఆశావహులు మక్కువ చూపుతున్నారు. మూడు రోజులుగా దరఖాస్తు ప్రక్రియ జిల్లాలో కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 36 టెండర్లను అధికారులు స్వీకరించారు. శుక్రవారం మంచి రోజు కావడంతో ఆశావహులు 26 దరఖాస్తులను అందజేశారు. ఇందులో సిద్దిపేట ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో 7, గజ్వేల్‌లో 3, చేర్యాలలో 5, మిరుదొడ్డిలో 5, హుస్నాబాద్‌లో 6 దరఖాస్తులను అధికారులకు అందజేశారు. ఇందుకోసం సిద్దిపేట ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో 9 కౌంటర్లు ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చూశారు. దరఖాస్తు చేసుకునే వారికి అధికారులు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 16 వరకు కొనసాగుతుంది. ఈ నెల 18న రెడ్డి సంక్షేమ భవనంలో కలెక్టర్ సమక్షంలో లాటరీ పద్ధతిన దుకాణాలను ఎంపిక చేస్తామని సిద్దిపేట ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.

78
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...