పారిశ్రామిక వాడ అభివృద్ధిపై సమీక్ష


Fri,October 11, 2019 11:06 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని యువతకు ఎక్కువగా ఉద్యో గ, ఉపాధి అవకాశాలు లభించేలా కృషి చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయంలో డీఆర్‌వో చంద్రశేఖర్, టీఎస్‌ఐఐసీ ఎండీ శివప్రసాద్, అం బికా దర్బార్ బత్తి ఎండీ సుదర్శన్‌తో కలిసి సిద్దిపేట పారిశ్రామిక వాడ అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ మందపల్లి శివారులో నెలకొల్పిన డీఎక్స్‌ఎన్ కంపెనీతో పాటు అంబికాదర్బార్ అగర్ బత్తి పరిశ్రమ నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఈ పరిశ్రమలో 1500 మందికి పైగా ఉపాధి దొరకనుందన్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అంబికా ఎండీ సుదర్శన్‌తో చర్చించి, ప్రతిపాదించిన అంశాలపై వెంటనే ఆమోదం ఇ వ్వాలని టీఎస్‌ఐఐసీ అధికారికి ఫోన్‌లో ఆదేశించారు. త్వరలోనే పెన్నార్ పరిశ్రమ సిద్దిపేటకు రానుందని, దీంతో 500మందికి పైగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. రోమన్ హెయిర్ పరిశ్రమను తేనున్నట్లు తెలిపారు. మందపల్లి పారిశ్రామిక వాడలో రోడ్డు పనుల పురోగతిపై ఆరా తీసి, త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. సమీక్షలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇన్‌చార్జి ఆర్డీవో అనంత్‌రెడ్డి, తహసీల్దార్లు, సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

75
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...