సమ్మె వీడి, ప్రజల కోసం ఆలోచించండి


Wed,October 9, 2019 10:34 PM

దౌల్తాబాద్: గత ప్రభుత్వ హయాంలోఉమ్మడి రాష్ట్రంలో ఆర్టీసీ సంస్థను నిర్వీర్యం చేశారని, స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో టీఎస్ ఆర్టీసీ లాభాల బాటలో పాయనిస్తున్నదని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సోలిపేట రామలింగారెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు పేర్కొన్నారు. బుధవారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆగ్రోస్ రైతు సేవా కేంద్రా న్ని వారు ప్రారంభించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో గత ప్రభుత్వలు ఏనాడూ ఆర్టీసీని పట్టించుకున్నా దా ఖలాలు లేవని, సమస్యలను గాలికి వదిలేసి, కార్మికుల గురించి కూడా పట్టించుకోలేదని, ప్రజారవా ణా వ్యవస్థను బలోపేతం చేసే చర్యలు చేపట్టలేద ని, ఇలా గత పాలకులు అనుసరించిన పద్ధతుల తో కూడా ఆర్టీసీ తీవ్రనష్టాలు చవి చూడడానికి కారణమైందన్నారు. సరైన సమయంతో సమ్మె చేస్తే, మావంతు సాయం ఉండేదని, గతేడాది ఇదే పద్ధతిలో ఇచ్చిన సమ్మె పిలుపు సందర్భంగా స్పందించిన ప్రభుత్వం, 2018 జూన్ నెలలో 16శాతం మధ్యంతర భృతిని ప్రకటించిందన్న విషయాన్ని గుర్తు చేశారు.

సంస్థ బలోపేతానికి ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని కార్పొరేషన్ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల నుంచి పౌరుల దాకా అర్థం చేసుకోవాలని చెప్పారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని ఆగం చేద్దామా? అలజడులు సృష్టించి, అనిశ్చితి పాలు చేద్దామా? అని ఆలోచిస్తే, ఆ నష్టం ఎవరికి అనేది కాలం నిర్ణయిస్తున్నదన్నారు. ప్రతిపక్షాల మాటలు విని ఆర్టీసీ కార్మికులు మోసపోవద్దని, ఉద్యమకారులుగా ఈ విషయాన్ని తాము చెబుతున్నామన్నారు. పండుగ పూట పేద ప్రజలు బస్సుల్లో ప్రయాణిస్తారని, ఈ సమయంలో సమ్మె సరైంది కాదని, తమ సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకునే హక్కు కార్మికులకు ఉందని, సమస్యలు పరిష్కారం కావడానికి సమయం పడుతుందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆర్టీసీ రూ.33వేల 300కోట్లు ఇచ్చిందన్నారు. కార్మికులు సమ్మె వీడి, ప్రజల కోసం ఆలోచించాలని కోరారు.

62
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...