గజ్వేల్ రూరల్: గజ్వేల్ పట్ణణంలో గత పది రోజులుగా నిర్వహించిన దేవీ శరన్నవరాత్రోత్సవాలు బుధవారంతో ముగిసాయి. దసరాను పురస్కరించుకుని మంగళవారం గజ్వేల్ మహంకాళి అమ్మవారు అపరాజితా దేవిగా, సంతోషిమాత స్వర్ణ కవచాలంకృత అయి నిజదర్శనమిచ్చింది. శరన్నవరాత్రోత్సవాల ముగింపు సందర్భంగా బుధవారం సంతోషిమాత ఆలయంలో కలషజలాలతో భక్తులందరినీ ప్రధానార్చకులు రాజశేఖరశర్మ ఆశీర్వదింది ఉత్సమమూర్తిని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉంచారు. గజ్వేల్ మహంకాళీ ఆలయంలో ఉత్సవాలు పూర్తి కావడంతో మూలమూర్తికి కలశజలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి అంగరంగవైభవంగా పట్టాభిషేకం నిర్వహించారు. కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ కాల్వ శ్రీధర్‌రావు, ప్రధానార్చకులు నందబాలశర్మ, వేదపండితులు చంద్రశేఖరశర్మ, సోమనాథ సిద్ధాంతి, అనంతశర్మ, సాయినాథశర్మ, సాయిభార్గవ, ఆలయ గజ్వేల్ మహంకాళికి