సత్వరమే పరిష్కరించాలి


Mon,October 7, 2019 11:15 PM

కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించి ప్రజల సమస్యలు తీర్చాలని జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రమైన సిద్దిపేటలోని ఆర్డీవో కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో జేసీ పద్మాకర్ పాల్గొని ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ వివిధ సమస్యల పై ప్రజలు దరఖాస్తులు చేసుకున్నారన్నారు. ఈ ప్రజావాణిలో ప్రజల నుంచి 7 దరఖాస్తులు వచ్చాయన్నారు. ఆయా శాఖల అధికారులు సమస్యలను పరిష్కరించాలని సూచించారు.కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...