వేంకటేశ్వర స్వామి సేవలో తరిస్తా


Mon,October 7, 2019 11:14 PM

సిద్దిపేట టౌన్ : కలియుగ దైవం వేంకటేశ్వర స్వామికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని టీటీడీ బోర్డు సభ్యుడు మురంశెట్టి రాములు అన్నారు. సిద్దిపేట లాల్‌కమాన్, వైశ్య ఫ్యామిలీ క్లబ్‌ల ఆధ్వర్యంలో సోమవారం సంతోషిమాత ఆలయంలో ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సేవలో ఇది ఒక అద్భుత అవకాశమన్నారు. సిద్దిపేట కీర్తిని చాటుతానని చెప్పారు. కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు అయిత నాగరాజు, తోట అశోక్, సురేశ్, రమేశ్, ఆత్మరాములు, బుచ్చయ్య, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

52
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...