జోరుగా ప్రగతి పనులు


Mon,October 7, 2019 11:14 PM

దుబ్బాక,నమస్తే తెలంగాణ : మండలంలోని అచ్చుమాయిపల్లిలో సోమవారం పారిశుధ్య పనులు కొనసాగించారు. సర్పంచ్ సోమారపు స్వప్న ఆధ్వర్యం లో ప్రగతి పనులు జోరుగా నిర్వహించారు. గ్రా మంలో పాత బావులను పూడ్చి వేయించారు. అ నంతరం గ్రామశివారులో పిచ్చి మొక్కలు తొలిగించారు. ఇప్పటికే గ్రామంలో అంతర్గత రహదారులను శుభ్రం చేశారు. తమ గ్రామాన్ని సంపూర్ణ స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగిస్తామని సర్పంచ్ స్వప్న తెలిపారు. గ్రామంలో ప్లాస్టిక్ కవర్ల వినియోగం నిషేధించినట్లు తెలిపారు. అచ్చుమాయిపల్లితో పాటు మదిర గ్రామామైన పరశురామ్‌నగర్‌లో పారిశుధ్య, పాత ఇండ్లు, బావుల పూడ్చివేతపనులు కొనసాగించారు.

45
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...