పూల సింగిడిలా.. గజ్వేల్ పట్టణం


Mon,October 7, 2019 11:14 PM

గజ్వేల్ నమస్తే తెలంగాణ : గజ్వేల్ పట్టణంలో సోమవారం సద్దుల బతుకమ్మ పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. పట్టణంలోని అన్ని వాడల్లో బతుకమ్మలను పెట్టి మహిళలు ఆడిపాడారు. సాయంత్రానికి పాండవుల చెరువు వద్దకు వెళ్లి బతుకమ్మ ఆటపాటలతో మహిళలు సందడి చేశారు. పాండవుల చెరువు మినీ ట్యాంక్ బండ్‌పై మున్సిపల్ అధికారులు పలు రకాల ఏర్పాట్లు చేశారు. భారీ కేడ్లు ఏర్పాటు చేసి మున్పిపల్ సిబ్బంది బతుకమ్మలను నీటిలో వదిలారు. విద్యుత్ లైట్లు సీసీ కెమెరాలు, అడుగుఅడుగున పోలిస్ బదోబస్తు ఏర్పాటు చేశారు. పట్టణానికి చెందిన మహిళలు, పిల్లలు, యువకులు, పురుషులు సద్దుల బతుకమ్మ ఉత్సావాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

53
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...