అర్హులైన డ్రైవర్లతో ఆర్డీసీ బస్సులు నడిపిస్తున్నాం: డీటీవో


Mon,October 7, 2019 11:13 PM

గజ్వేల్‌టౌన్: ఆర్టీసీ బస్సులను నడిపించేందుకు అర్హులనే ఎంపిక చేస్తున్నట్లు డీటీవో రామేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉదయం గజ్వేల్‌ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోను సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, జీపీపీ డిపోల్లోని బస్సులను గత మూడు రోజులుగా అర్హులైన వారిచే నడిపిస్తున్నమని, ఇప్పటి వరకు ప్రయాణికులకు ఇబ్బంది కలుగకుండా బస్సులు రోడ్డెక్కె విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. తాత్కాలికంగా బస్సులను నడిపేందుకు వచ్చే వారికి లైసెన్స్, అనుభవనంతో పాటు వారిని ఆరోగ్యపరంగా చూసి ఎంపిక చేశామన్నారు. అన్ని డిపోలో అవసరం మేరకు బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రయాణికులకు ఇబ్బందులు చోటుచేసుకొకుండా డ్రైవర్లను తీసుకొవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో సీఐ ప్రసాద్‌లున్నారు.

48
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...