ఇబ్బందులు లేకుండా అధికారుల చర్యలు


Mon,October 7, 2019 11:13 PM

సిద్దిపేట టౌన్ : ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లడంతో రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టి సఫలీకృతమయ్యారు. పండుగ వేళ ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు అధికార యంత్రాంగం చేపట్టింది. జిల్లా జాయింట్ కలెక్టర్ పద్మాకర్, సీపీ జోయల్ డెవిస్, జిల్లా రవాణా శాఖ అధికారి రామేశ్వర్‌రెడ్డి, అడిషినల్ డీసీపీ నర్సింహారెడ్డిలు ప్రత్యేకంగా పర్యవేక్షించి ప్రయాణీకులకు ఇబ్బందులు కలుగకుండా చూశారు. బస్సు డిపోల వద్ద గట్టి పోలీసు బందోబస్తును చేపట్టారు. అన్ని రూట్లలో బస్సులు నడిచేలా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నారు. సిద్దిపేట జిల్లాలో సమ్మె ప్రభావం కనిపించలేదు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 4 బస్సు డిపోల్లోని బస్సులు యదావిధిగా ప్రయాణీకులను గమ్యసానాలకు చేర్చాయి. సిద్దిపేట డిపో పరిధిలోని 85 బస్సులు, గజ్వేల్ డిపో పరిధిలో 71, హుస్నాబాద్ డిపో పరిధిలో 49, దుబ్బాక డిపో పరిధిలో 29 బస్సులు ఆయా రూట్లలో అధికారులు నడిపించారు. సిద్దిపేట, గజ్వేల్, హుస్నాబాద్, దుబ్బాక డిపోల పరిధిలో ప్రయాణీకులకు ఇబ్బందులు లేకుండా డీటీవో రామేశ్వర్‌రెడ్డి అనుభవజ్ఞులైన డ్రైవర్లను నియమించి బస్సులు నడిచేలా చూశారు.

38
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...