జిల్లాలో వర్షం


Mon,October 7, 2019 12:33 AM

-ఉరుములు, మెరుపులతో పలు చోట్ల పిడుగులు
-ఇద్దరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
-బాధిత కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి హరీశ్‌రావు

సిద్దిపేట కలెక్టరేట్, నమస్తే తెలంగాణ : జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వ ర్షం కురిసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉరుములతో కూడిన వర్షంతో పాటు పలుచోట్ల పిడుగులు పడ్డాయి. పిడుగుపాటుతో సిద్దిపేటలో ఇద్దరు మరణించగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. అలాగే, పొలాల్లో ఉన్న పలు పాడి పశువులు మృతి చెం దాయి. కోహెడ మండలం వింజపల్లిలో కొబ్బరిచెట్టుపై పిడుగుపడింది. భారీ వర్షాలకు తొగుట, లిం గంపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇరుగ కాసిన పత్తి చేలు నేలకొరిగింది. వరి పంట సైతం పడిపోయింది.

పండుగ పూట విషాదం..
సిద్దిపేట టౌన్ : పిడుగు పాటుతో పండుగ పూ ట విషాదం జరిగింది. వర్షం పడుతున్నదని చెట్టు కిందికి వెళ్లిన ముగ్గురుపై పిడుగు పడింది. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనతో కుటుంబాల్లో విషాదం నెలకొంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన పస్తం శ్రీనివాస్(34), వానరాశి బాల్‌రాజు(36), చెన్నూరి సారయ్య పనినిమిత్తం బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వర్షం పడడంతో చింతల్‌చెరువు కట్టపైన చింతచెట్టు కిందికి వెళ్లారు. ఆకస్మాత్తుగా పిడుగు పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్, బాల్‌రాజులు అక్కడికక్కడే మృతి చెందా రు. తీవ్రంగా గాయపడిన సారయ్యను సిద్దిపేట దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వారందరూ దినసరి కూలీలుగా పనిచేస్తూ కుటుంబాలను పోషిస్తున్నారు. విషయం తెలుసుకున్న అడిషినల్ డీసీపీ నర్సింహారెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి విచారణ జరిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు.

తొగుట మండలంలో భారీ వర్షం
నేలకొరిగిన పత్తి, వరి చేన్లు
తొగుట : ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం తొగుట మండలాన్ని అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు తొగుట, లింగంపేటతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ఇరుగ కాసిన పత్తి చేన్లు నేలకొరిగాయి. వరి పంట సైతం పడిపోయింది.

పిడుగు పాటుకు గేదె మృతి
రాయపోల్ : పిడుగు పాటుకు గేదె మృతి చెందిన సంఘటన రాయపోల్ మండలం చిన్నమాసాన్‌పల్లిలో ఆదివారం జరిగింది. బాధితుడి కథనం ప్రకారం.. రేకుల శ్రీనివాస్‌రెడ్డి తనకు ఉన్న రెండు గేదెలతో వ్యవసాయం చేస్తున్నాడు. తన వ్యవసాయ పొలం వద్ద మధ్యాహ్నం ఉరుములు, మోరుపులతో వర్షంతో పిడుగు పడడంతో గేదె అక్కడిక్కడనే మృతి చెందింది. దింతో తనకు రూ. 40 వేల నష్టం జరిగినట్లు రైతు విలపించాడు.

పిడుగు పాటుకు రెండెడ్లు మృతి
దౌల్తాబాద్ : పిడుగు పాటుకు రెండెడ్లు మృతి చెందిన సంఘటన గొడుగుపల్లిలో ఆదివారం జరిగింది. గొడుగుపల్లికి చెందిన బాధితుడు మల్ల య్య వివరాల ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ఊరుములు మెరుపులతో కూడిన వర్షంలో ఒక్కసారిగా పిడుగు పడి రెండు ఎద్దులు మృతి చెందాయి. తనకున్న రెండు ఎద్దులు మృతి చెందడంతో దిక్కు తోచని స్థితిలో రైతు మల్లయ్య, తన బాధను తెలిపాడు. ఎడ్ల విలువ సుమారు రూ. లక్ష ఉంటుదన్నాడు. ప్రభుత్వం తన కుటుంబాన్ని అదుకోవాలని బాధితుడు తెలిపాడు.

వింజపల్లిలో కొబ్బరి చెట్టుపై పడిన పిడుగు
కోహెడ: కోహెడ మండలం వింజపల్లి గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు ఉరుముతూ మెరుపులతో చిరుజల్లులు కురిసాయి. గ్రామంలో రెండు చోట్ల పిడుగులు పడ్డా యి. మామిడి రాజేశం కొబ్బరి చెట్టుపై పిడుగు పడి మంటలు లేచాయి. ఈ సంఘటనలో ఎవరికి అపాయం జరుగలేదు.

133
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...