పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య


Mon,October 7, 2019 12:32 AM

దౌల్తాబాద్ : పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల పరిధిలోని గాజులపల్లిలో శనివారం అర్ధరాత్రి జరిగింది. కుటుంబ వివరాలు ప్రకారం.. గ్రామానికి చెందిన పోతుగంటి కనకరెడ్డి(37) కొన్నిఎండ్ల నుంచి హైదారబాద్‌లో నివసిస్తూ వివిధ రకాల పనులు చేసుకుంటూ కటుంబంతో జీవిస్తున్నాడు. గత నెల హైదరాబాద్ నుంచి తన సొంత గ్రామమైన, గాజులపల్లికి వచ్చి ఇక్కడే ఉన్నాడు. అప్పటినుంచి కుటుంబం పూట గడవకపోవడంతో మనస్తాపనికి గురై శనివారం తన ఇంటిలోనే పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే హైదరాబాదులోని గాంధీ దవాఖానకు తరలించారు. చికిత్చ పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి, భార్య, కుతూరు, కుమారుడు ఉన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...