అటవీ సంరక్షణ చర్యలు భేష్


Mon,October 7, 2019 12:31 AM

గజ్వేల్, నమస్తే తెలంగాణ : గజ్వేల్ అటవీ రెంజ్ పరిధిలో విస్తరణ చర్యలు బాగున్నయని జార్ఖండ్‌కు చెందిన డెహ్రడూన్ ఐఎఫ్‌ఎస్ ప్రోబెషనరీ అటవీ అధికారుల బృందం కితాబుచ్చింది. ఆదివారం 70 మంది బృందం గజ్వేల్ పరిధిలోని సింగాయపల్లి, మైలారం, కోమటిబండ, సంగాపూర్ అటవీ ప్రాంతాలను సందర్శించి వివిధ రకాల ప్లాంటేషన్‌లను పరిశీలించారు. ముందుగా సింగాయపల్లి అటవీ ప్రాంతంలో ఏఎన్‌ఆర్ ప్లాంటేషన్‌ను పరిశీలించారు. అక్కడే మియావాటి ప్లాంటేషన్‌ను పరిశీలించారు. ఈ పద్ధ్దతుల ద్వారా చేపట్టిన చర్యల వివరాలపై అడిగి తెలుసుకున్నారు. రాజీవ్ రహదారి నుంచి మైలారం, నెంటూర్ మీదుగా కోమటిబండ వరకు ఏవెన్యూ ప్లాంటేషన్ ద్వారా కేవలం 2 ఏండ్లలో నాటిన మొక్కలు పెద్దగా పెరగడాన్ని గుర్తించారు. మండలంలోని కోమటిబండకు చేరుకొని మిషన్ భగీరథ కేంద్రాన్ని చూశారు. నీటి సరఫరాపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సంగాపూర్ కల్పకవనానికి చెరుకొని అక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల ప్లాంటేషన్ అర్బన్ పార్క్ ఏర్పాటును పరిశీలించారు. బృందానికి డా.ఎస్.పి ఆనంద్ నేతృత్వం వహించగా 70 మంది అధికారులు ఉన్నారు. మెదక్ కన్వర్జేటర్ సీఎఫ్ శరవన్, డీఎఫ్‌వో శ్రీధర్‌రావు, ఎఫ్‌ఆర్‌వో వెంకటరామరావు తదితరులున్నారు.

55
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...