అమ్మవారికి మంత్రి హరీశ్‌రావు పూజలు


Mon,October 7, 2019 12:31 AM

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: హుస్నాబాద్ పట్టణంలోని హన్మకొండ రోడ్డులో పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి విగ్రహ మండపంలో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. వరంగల్ నుంచి సిద్దిపేటకు వస్తున్న సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకుల కోరిక మేరకు దుర్గాదేవి సన్నిధికి వచ్చి పూజల్లో పాల్గొన్నారు. పూజారి రామక పవన్‌శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మంత్రి అమ్మవారికి పూలమాలలు వేసి టెంకాయ కొట్టి, మంగళహారతులు ఇచ్చారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం నాయకులు మంత్రిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. గులాబీ మొక్కలను బహూకరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ రాయిరెడ్డి రాజిరెడ్డి, టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండ్లె రాజేశ్వర్, రాగి కవిత, బెజుగం బాలకిష్టయ్య, సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్‌లు దొడ్ల శ్రీనివాస్‌రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, నాయకులు కొడముంజ రమేశ్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.

58
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...