చికిత్స పొందుతూ మహిళ మృతి


Mon,October 7, 2019 12:31 AM

సిద్దిపేట రూరల్, నమస్తే తెలంగాణ : సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని మాచాపూర్ గ్రామానికి చెందిన మహిళ అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దుర్గి లక్ష్మి (50) వారం క్రితం అనారోగ్యానికి గురైంది. ఆమెను రెండు రోజుల కింద చికిత్స నిమిత్తం సిద్దిపేటలోని ప్రైవేటు దవాఖానకు తరలించారు. కాగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు లక్ష్మిని ప్రైవేటు దవాఖానలో చేర్పించగా స్వైన్‌ఫ్లూగా అనుమానించి చికిత్స అందిస్తున్నారు. ఈలోపు లక్ష్మి చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు గ్రామంలో జిల్లా మలేరియా అధికారి కాశీనాథ్ ఆధ్వర్యంలో వైద్యులు గ్రామంలో పర్యటించారు. అక్కడే వైద్య శిబిరం ఏర్పాటు చేసి గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.

35
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...