ఉమ్మడి జిల్లాలో 528 బస్సు సర్వీసులు


Mon,October 7, 2019 12:31 AM

- తాత్కాలికంగా 720 మంది డ్రైవర్లు, కండక్టర్ల నియామకం
- డిపోల ఎదుట ఆందోళనలు
సంగారెడ్డి టౌన్ : ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె ఉమ్మడి జిల్లాలో పాక్షికంగా జరిగింది. కార్మికులు తలపెట్టిన సమ్మె ప్రభావం ఎక్కడా కనిపించలేదు. అధికారులు ముందస్తు ప్రణాళికలు చేయడం వల్ల ప్రజా రవాణాకు ఎక్కడా బ్రేక్ పడలేదు. ఉమ్మడి మెదక్ రీజియన్ నుంచి 8 డిపోల పరిధిలో 672 బస్సులు ఉంటే అందులో 528 బస్సులు యథావిధిగా నడిచా యి. 358 ఆర్టీసీ బస్సులు, 170 ప్రైవేట్ (అద్దె ప్రాతిపదికన) బస్సులు సేవలు అందించాయి. ఆదివారం కూడా సంగారెడ్డిలోని ఆర్టీఏ కార్యాలయంలో తాత్కాలికంగా పనిచేసే డ్రైవర్లను, సంగారెడ్డిలోని ఆర్టీసీ డిపో వద్ద ఉదయం నుంచి కండక్టర్ల నియామకం చేపట్టారు. కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల కోసం అభ్యర్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. తాత్కాలిక పద్ధ్దతిలో విధుల్లో చేరిన కార్మికులు.. ఉమ్మడి జిల్లాలో సాయం త్రం వరకు 528 బస్సులు నడిపి, ప్రయాణికులను సురక్షితంగా గమ్య స్థానాలకు చేర్చారు.

కనిపించని సమ్మె ప్రభావం..
ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న సమ్మె మెదక్ రీజియన్ పరిధిలో ఎలాంటి ప్రభావం చూపలేదు. ఉదయం 5:00 గంటల నుంచే బస్సులు తిరిగాయి. తాత్కాలిక పద్ధ్దతిలో పనిచేసేందుకు వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు బస్సులను తిప్పారు. మెదక్ రీజియన్ పరిధిలో ఆదివారం 528 బ స్సులు తిరిగినట్లు ఆర్‌ఎం రాజశేఖర్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రయాణికులకు ఎలాం టి ఇబ్బందులు లేకుండా బస్సులను తిప్పేందు కు మెదక్ రీజియన్ పరిధిలో 360 మంది డ్రైవ ర్లు, 360 మంది కండక్టర్లను నియమించారు. ఆదివారం కూడా తాత్కాలిక పద్దతిలో డ్రైవర్లుగా పనిచేసేందుకు ఉత్సాహం ఉన్నవారికి ఇంటర్య్వూలు నిర్వహించి విధుల్లోకి తీసుకున్నారు.

కార్మికుల ఆందోళనలు..
సమ్మెలో భాగంగా ఆర్టీసీ జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లాలోని 8 డిపోల ఎదుట ఆందోళన లు నిర్వహించారు. ఉదయం ఆర్టీసీ డిపోల వద్ద మౌన ప్రదర్శనలు నిర్వహించారు. జిల్లా కేంద్రం సంగారెడ్డిలో జేఏసీ నాయకులు ఐబీ నుంచి కొత్త బస్టాండు వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ఎదుట బతుకమ్మ ఆటలు ఆడి నిరసన తెలియజేశారు. ఆర్టీసీ సమ్మెకు సీఐటీయూ నాయకులు సంఘీభావం ప్రకటించి కొత్త బస్టాండ్ ఎదుట ధర్నా చేసి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...