నేడు సద్దుల సంబురం


Sat,October 5, 2019 11:24 PM

-జిల్లావ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
-చెరువుల వద్ద లైటింగ్, నిమజ్జనం కోసం ఏర్పాట్లు
- ముస్తాబైన సిద్దిపేట కోమటి చెరువు
-విద్యుత్తు కాంతుల్లో జిగేల్..జిగేల్
-సంబురాలకు హాజరుకానున్న మంత్రి హరీశ్‌రావు
- నేటితో బతుకమ్మ వేడుకలు ముగింపు

సిద్దిపేట ప్రతినిధి, నమస్తే తెలంగాణ : తెలంగాణ అతి ము ఖ్యమైన పండుగల్లో బతుకమ్మ ఒకటి. ఎంగిలిపూలతో ప్రారంభమైన బతుకమ్మ ఆదివారం తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో ముగుస్తుంది. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబా ద్, జనగామ నియోజకవర్గంలోని చేర్యాల పట్టణ కేంద్రాలతో పాటుగా ఆయా మండల కేంద్రాల్లోనూ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించనున్నారు. బతుకమ్మ పేర్చేందుకు కావాల్సిన తంగేడు పూలు, గునుగు పూలు, అడవి చామంతి, గడ్డి, గుమ్మడి పూవు, బంతి, పోకబంతి, ప ట్టు గుచ్చుల పూలు, గుమ్మడి ఆకులు ఇలా రకరకాల పూలను గ్రామాల నుంచి మార్కెట్లకు తీసుకొచ్చి అమ్ముతున్నారు. జి ల్లా వ్యాప్తంగా సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించడానికి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు వద్ద నిర్వహించే సద్దుల బతుకమ్మ సంబురాల్లో ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ యా నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. జిల్లా ప్రజలంతా సంతోషంగా పండుగ జరుపుకోవడానికి సి ద్ధమయ్యారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా అన్ని గ్రామా ల్లో పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టారు. గ్రామాలు సరికొత్త అందాలు సంతరించుకొన్నాయి.చెరువు గట్ల వద్ద లైటింగ్ ఏ ర్పాటు చేశారు. బతుకమ్మలు నిమజ్జనం చేసే చెరువులకు ప్ర త్యేకంగా బతుకమ్మ మెట్లను తొలి విడుత మిషన్ కాకతీయలో నిర్మించారు. మూడేండ్ల నుంచి ఆడపడుచులకు బతుకమ్మ చీరెలను ప్రభుత్వం అందిస్తున్నది. హైదరాబాద్, హన్మకొండ తర్వాత యేటా పెద్ద ఎత్తున సద్దుల బతుకమ్మ ఉత్సవాలు నిర్వహించే సిద్దిపేట కోమటి చెరువు వద్ద భారీ ఏర్పాట్లను చేశారు. జిల్లాలోని గజ్వేల్ పాండవుల చెరువు, దుబ్బాక పెద్ద చెరువు, హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు, చేర్యాల కుడి చెరువుల వద్ద భారీ స్థాయిలో బతుకమ్మ ఏర్పాట్లు చేశారు.

సద్దుల బతుకమ్మ సంబురం
సద్దుల బతుకమ్మ రోజు పల్లెలో పిల్లా పాప పెద్దల వరకు అందరిలో సంబురం అంబరాన్నంటుతుంది. తెలతెల్లారక ముందే పరుగు పరుగునా అడవికెళ్లి తంగేడు పువ్వు, గునుక, గడ్డి, చామంతి తదితర పూలను తీసుకొస్తారు. ఉదయం పే ర్చిన బతుకమ్మకు పూజలు చేసి సాయంత్రం వేళలో మహిళంతా కొత్తబట్టలు ధరించి, గ్రామ చావిడీలు, గల్లీల వద్ద బతుకమ్మ ఆడుతారు. మొదటి రోజు నుంచి తొమ్మిది రోజుల వరకు వివిధ రకాల ప్రమీదలు తయారు చేసి ఆడారు. తొమ్మి దో రోజు సద్దుల బతుకమ్మకు రంగు రంగుల పూలతో పోటీలు పడి పెద్దవిగా పేర్చనున్నారు. సద్దుల బతుకమ్మ రోజు పసుపు ముద్ద(గౌరమ్మ)ను స్త్రీల సౌభాగ్యానికి నిదర్శనంగా చెబుతుంటారు. శక్తికి ప్రతిరూపంగా ఈ బతుకమ్మను పూజిస్తారు.

సాగనంపుతూ..
బతుకమ్మ పోతుంది.. సందమామ.. అంటూ బతుకమ్మను సాగనంపుతూ మహిళలు పాటలు పాడుతారు. బతుకమ్మలపై పిండి ప్రమీదల జ్యోతులు వెలిగిస్తారు. పైభాగాన ఉన్న గౌరమ్మ(పసుపు)ను తీసి, బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేస్తారు. గౌరమ్మగా చేసిన పసుపు ముద్దను వాయినంగా మహిళలు స్వీకరిస్తారు.

వాయినాలు ఇచ్చుకుంటూ..
పసుపులో పెరిగే గౌరమ్మ.. అంటూ మహిళలు చెరువు గట్టు వద్ద వాయినాలు ఇచ్చుకున్న అనంతరం తమతో తెచ్చుకున్న ఫలహారాలు, సద్దులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకుని తింటారు. చెరువు గట్టు వద్ద నుంచి మహిళలు పాటలు పాడుకుంటూ తిరిగి వస్తారు. తొమ్మిది రోజుల పాటు సంబురంతో జరుపుకున్న బతుకమ్మ పండుగ ముగుస్తుంది.

56
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...