ఘనంగా మాజీ ఎంపీపీ జన్మదిన వేడుకలు


Sat,October 5, 2019 11:21 PM

నంగునూరు : మండలంలోని రాజగోపాల్‌పేటలో మాజీ ఎంపీపీ జాప శ్రీకాంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి 21 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అనంతరం ప్రజాప్రతినిధులు, కార్యకర్తల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శ్రీకాంత్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రక్తదానం చేసిన యువ కులకు పండ్లను పంపిణీ చేశారు. అలాగే, నాగరాజుపల్లిలో అన్నదానం చేశారు. కార్యక్ర మంలో మాజీ జడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, జడ్పీటీసీ ఉమావెంకట్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు కిష్టారెడ్డి, సర్పంచ్‌లు రాజేంద్ర, అజీజ్, కుమార్, భిక్షపతి, నాయకులు సంగు పురేందర్, రాజుగౌడ్, చందు, కమాల్ షరీఫ్, లకా్ష్మరెడ్డి, బ్లక్ బ్యాంకు ఇన్‌చార్జి డా.అరుణ, పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రవీణ్‌నాయక్ పాల్గొన్నారు.

46
Tags

More News

మరిన్ని వార్తలు...

VIRAL NEWS

మరిన్ని వార్తలు...